Sonia Gandhi Health:  సోనియా గాంధీకి సీరియస్‌...హుటాహుటిన రాహుల్, ప్రియాంక...

కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వెంటనే ఆమెను ఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆస్పత్రికి తరలించారు. విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం రాత్రి సోనియాగాంధీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు,

New Update
FotoJet (37)

Sonia Gandhi Health

Sonia Gandhi Health: కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వెంటనే ఆమెను ఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆస్పత్రికి తరలించారు. విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం రాత్రి సోనియాగాంధీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు, దీంతో ఆమెను దేశ రాజధానిలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో వైద్యపరీక్షల కోసం చేర్చారు. డాక్టర్లు ఆమెను అబ్జర్వేషన్ లో ఉంచారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఆమె అనారోగ్యానికి గల కారణాలు తెలియలేదు.సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరిన సమయంలో ఆమె వెంట లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు కార్యకర్తలకు పిలుపునిచ్చారు..

కాగా, సోనియా గాంధీ గత రెండు రోజులుగా కొంత అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమె ఆరోగ్యం మంగళవారం రాత్రి అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో తీవ్ర అసౌకర్యానికి గురి కావడం, అదే సమయంలో దగ్గు ఎక్కువగా రావడం వల్ల ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది.  కాగా సోనియాగాంధీ గత  రెండు నెలల క్రితం 2026 జనవరిలో కూడా అనారోగ్యానికి గురయ్యారు. ఆమెను ఆరు రోజుల పాటు సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు.

నిన్న రాత్రి మరోసారి అస్వస్థతకు గురి కావడంతో పాటు ఛాతీ నొప్పితో సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు డాక్టర్ అనూప్ బసు పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. సోనియాగాంధీకి ఛాతీ వైద్య నిపుణుల బృందం ఆధునిక పరీక్షలు నిర్వహిస్తోంది. అనారోగ్యం కారణంగా ముందుజాగ్రత్తగా ఆమెను పర్యవేక్షణలో ఉంచామని వైద్యులు తెలిపారు. కాలుష్యం కారణంగా సోనియా గాంధీ కొంతకాలంగా తగ్గని దగ్గుతో బాధపడుతున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Advertisment
తాజా కథనాలు