Delhi : భర్తకు క్షయవ్యాధి, ముగ్గురు పిల్లలు : జాబ్ కోసమని వెళ్తే.. ఢిల్లీ సామూహిక అత్యాచార విస్తుపోయే నిజాలు!

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి అత్యంత ఘోరమైన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సులో ఒక మహిళపై డ్రైవర్,  క్లీనర్ కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

New Update
bus

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి అత్యంత ఘోరమైన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సులో ఒక మహిళపై డ్రైవర్,  క్లీనర్ కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన కంటే దారుణమైన విషయం ఏమిటంటే, సదరు బస్సుపై గత ఏడాది కాలంగా 36 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, అది దర్జాగా రోడ్లపై తిరుగుతూనే ఉంది.

పోలీసుల సమాచారం ప్రకారం, బాధిత మహిళ సరస్వతి విహార్ బస్టాండ్ వద్ద ఈ స్లీపర్ బస్సు ఎక్కారు. బస్సు సుమారు 7 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత నాంగ్లోయ్ రైల్వే రోడ్డు సమీపంలో ఆగింది. అక్కడే బస్సు డ్రైవర్ ఉమేష్ కుమార్, క్లీనర్ రామేంద్ర కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున 2:30 గంటలకు ఆమె బస్సు దిగుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఉదయం 4:45 గంటలకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేసి, బస్సును సీజ్ చేశారు.

విస్తుపోయే నిజాలు

ఈ కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. బీహార్ రాష్ట్ర రిజిస్ట్రేషన్ గోపాల్‌గంజ్ జిల్లాతో  కలిగిన ఈ బస్సు ఢిల్లీ - బీహార్ మధ్య నడుస్తోంది. దీనిపై ఫిబ్రవరి 2, 2025 నుండి మే 6, 2026 మధ్య కాలంలో మొత్తం 36 చలాన్లు నమోదయ్యాయి. పెనాల్టీ మొత్తం సుమారు రూ. 3.3 లక్షలుగా ఉంది. పర్మిట్ నిబంధనల ఉల్లంఘన, రాంగ్ రూట్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, నో-పార్కింగ్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, ఆర్‌సీ (RC) ఉల్లంఘనలుగా జరిమానా విధించారు. చివరి రెండు చలాన్లు నిందితుడైన డ్రైవర్ ఉమేష్ కుమార్ పేరు మీదనే ఉండటం గమనార్హం. ఇన్ని చలాన్లు ఉన్నా ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ పేరుతో ఈ బస్సు ఎలా తిరుగుతోందనే దానిపై ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ ,  రవాణా శాఖ ప్రత్యేక విచారణ చేపట్టాయి. ఈ ఘోరం జరిగిన ప్రాంతం నాంగ్లోయ్ పోలీస్ స్టేషన్, డీసీపీ కార్యాలయానికి కేవలం 700 మీటర్ల దూరంలోనే ఉండటం భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపుతోంది.

తన భర్త క్షయవ్యాధితో బాధపడుతూ నిరుద్యోగిగా ఉండటంతో, కుటుంబాన్ని పోషించుకోవడానికి తాను ఈ వృత్తిలోకి రావాల్సి వచ్చిందని బాధితురాలు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. తన ఇంటి వద్ద ముగ్గురు పిల్లలు ఉన్నారని తనకోసం ఎదురుచూస్తున్నారని బాధితురాలు కన్నీ్ళ్లు పెట్టుకుంది. తాను ఎవరికి ఈ విషయం చెప్పనని కోరడంతో నిందితులు ఆమెను వదిలేశారు. కొద్దిదూరం వెళ్లాక బాధితురాలు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పింది.  ఆమెకు భర్తతో పాటుగా 4,6,9 ఏళ్ల పిల్లలున్నారు. 

Advertisment
తాజా కథనాలు