యూపీ మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం.. వెలుగులోకి సంచలన నిజాలు!

యూపీ ఝాన్సీ మెడికల్ కాలేజీలో జరిగిన అగ్నిప్రమాదంలో 10మంది చిన్నారులు చనిపోయారు. ఈ ప్రమాదానికి అసలు నిజాలు బయటకొచ్చాయి. ఓ నర్సు ఆక్సిజన్‌ సిలిండర్‌ పైప్‌ కనెక్ట్‌ చేస్తుండగా మరోనర్సు అగ్గిపుల్ల వెలిగించడంతోనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షి చెప్తున్నారు.

New Update
fire accident at Jhansi Medical College

తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో మంటలు చెలరేగడంతో పది మంది శిశువులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. అయితే ఈ ప్రమాదానికి అసలు కారణం షార్ట్ సర్క్యూట్‌ అని అధికారులు అనుమానించారు.

Also Read: రేవంత్ ఛాలెంజ్‌ స్వీకరించిన కిషన్ రెడ్డి..3 నెలలు అక్కడే నిద్ర!

నర్సు నిర్లక్షమే ప్రమాదానికి కారణం

అయితే ఈ ప్రమాదంపై తాజాగా సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఓ నర్సు నిర్లక్షమే ఈ ప్రమాదానికి కారణం అని ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారు. ముందుగా ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావించిన అధికారులు.. ఇప్పుడు షాకింగ్ నిజాలు బయటకు రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

Also Read: పెళ్లి పేరుతో మైనర్ బాలికను తల్లిదండ్రులు.. ఏం చేశారంటే?

ICUలో హమీర్‌పూర్‌కు చెందిన భగవాన్‌ దాస్‌ కొడుకు చికిత్స పొందుతున్నాడు. అదే సమయంలో ఓ నర్సు ఆక్సిజన్‌ సిలిండర్‌ పైప్‌ కనెక్ట్‌ చేస్తుండగా మరో నర్సు అగ్గిపుల్ల వెలిగించడంతోనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. దీంతో క్షణాల్లోనే వేగంగా మంటలు వ్యాపించడంతో.. నలుగురు పిల్లలను ఎత్తుకొని బయటకు పరుగులు తీశానని తెలిపారు.

Also Read: మోదీకి బిగ్ షాక్.. ఎన్నికలకు ముందు అధికార మహాయుతి కుటమిలో విభేదాలు

ఇతరుల సాయంతో మరికొంత మందిని కాపాడాని ఆ ప్రత్యక్షసాక్షి తెలిపారు. మంటలు వ్యాపించి పొగలు కమ్మడంతో భయంతో అందులో ఉండేవారంతా పరుగులు పెట్టారని.. అదే క్రమంలో తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు.

Also Read: ట్రంప్ మరో విచిత్ర నిర్ణయం.. వ్యాక్సిన్లు వద్దన్న వ్యక్తికి హెల్త్ మినిస్ట్రీ!

దీంతో ఈ ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని యూపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా ప్రమాదంలో అప్పటికే ICUలో మొత్తం 47 మంది చిన్నారులు చికిత్స తీసుకుంటున్నారు. ఇక ప్రమాద సమయంలో అందులో 10 మంది చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Waqf Board Act: వక్ఫ్ బోర్డు చట్టంలో కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

వక్ఫ్ బోర్డు చట్టంపై ధాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషనర్ తరపు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీలు న్యాయస్థానం ముందు వాదనలు వినిపించారు. కేంద్రం తరపున వాదనలు వినిపించడానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరైయ్యారు.

New Update
V BREAKING

వక్ఫ్ బోర్డు చట్టంపై ధాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టులో త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషనర్ తరపు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీలు అత్యున్నత న్యాయస్థానం ముందు వాదనలు వినిపించారు. కేంద్రం తరపున వాదనలు వినిపించడానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరైయ్యారు. కేసు విచారించిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వక్ఫ్ చట్టాల అమలుపై స్టే విధించాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టును కోరారు. ముస్లీం కమ్యూనిటీ అధికారాలను లాక్కునేందుకు కుట్ర జరుగుతుందని కపిల్ సిబల్ కోర్టులో పేర్కొన్నారు. వక్ఫ్ నూతన చట్టాలు మతస్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయని కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.

Also read: మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయ్యిందా..? అయితే ఇలా చేయండి

హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుందా, హిందువుల ఆస్తులు హిందువులే నిర్వహిస్తున్నారు కదా అని సీజేఐ ప్రశ్నించారు. ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ బోర్డు భూముల్లోనే ఉందని సీజేఐ అన్నారు. చారిత్రాత్మక ఆస్తులను వక్ఫ్ గా ప్రకటించలేమన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు చెప్పారు. 2వారాల్లో కేంద్రం వక్ఫ్ చట్టంపై వివరణ ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు పంపింది. కలెక్టర్లకు వక్ఫ్ బోర్డు ఆస్తులపై అధికారం కల్పించడంపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.

 

 

 

Advertisment
Advertisment
Advertisment