/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/shirdi-jpg.webp)
Shirdi
షిర్డీ వెళ్లే భక్తులకు సాయిబాబా సంస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో ఉన్న షిర్డీ సాయిబాబాను దర్శించుకోవడానికి దేశవ్యాప్తంగా ఎందరో భక్తులు వెళ్తుంటారు. వీరికి సాయిబాబా సంస్థాన్ గుడ్ న్యూస్ తెలిపింది. షిర్డీ వచ్చే భక్తులకు రూ.5 లక్షల ప్రమాద బీమాను అందించనున్నట్లు వెల్లడించింది. సాయిబాబా దర్శనం, భక్త నివాస్, అభిషేకం, మిగతా పూజ కార్యక్రమాల కోసం అధికారిక వెబ్‌సైట్లలో బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే ఈ ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపింది.
ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్!
शिर्डीला येणाऱ्या भक्तांसाठी तब्बल ‘इतक्या’ लाखांचा विमा, साईबाबा संस्थानची नेमकी योजना काय? https://t.co/6tVaJG9uR3
— Mahaenews (@mahae_news) March 31, 2025
ఇది కూడా చూడండి: Ashwani Kumar : డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
కేవలం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే..
దర్శనం చేసుకోవడానికి మీరు బస్సు లేదా రైలు ఇలా ఏ విధంగా అయినా వెళ్లే సమయంలో ప్రమాదం జరిగితే మీకు బీమా వర్తిస్తుంది. అయితే దర్శనం కోసం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వెంటనే భక్తులకు రూ.5 లక్షల ప్రమాదబీమా వర్తిస్తుంది. దీనికోసం ఎలాంటి ఎక్స్‌ట్రా ఛార్జీలు కట్టక్కర్లేదు. ఈ పథకం సుమారుగా 10 లక్షల మంది భక్తులకు వర్తిస్తుందని తెలిపింది. అయితే నేటి నుంచే ఈ పథకం వర్తించనుంది. దీని కోసం బీమా కంపెనీకి రూ.48 లక్షలు చెల్లించినట్లు సాయిబాబా సంస్థాన్ సీఈవో తెలిపారు.
ఇది కూడా చూడండి: IPL 2025: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్