Vinesh Phogat:ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో చూపించిన వినేశ్ ఫోగాట్

ప్రతీ మలుపులో పోరాటం..అథ్లెట్‌గా భారత్‌‌కు ఎన్నో పతకాలు తెచ్చిన వినేశ్ ఫోగాట్‌ను రోడ్డు మీద ఈడ్చుకెళ్ళారు..ఒలింపిక్స్‌లో డిస్‌ క్వాలిఫై చేశారు..కానీ ప్రజల మనసుల్లో ఆమె స్థానాన్ని చెరప లేకపోయారు.అందుకే హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోయినా వినేశ్ మాత్రం గెలిచింది.

New Update
phogat

Vinesh Phogat: 

అక్కలు వేసిన నిచ్చెనల మీద సునాయాసంగా అథ్లెట్ అయింది. పెదనాన్న నేర్పిన పాఠాలతో రెజ్లింగ్‌లో తన సత్తా చాటి దేశానికి పతకాలను అందించింది. కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేతగా అవతరించింది. వరుసగా 2014, 2018  2022లో  స్వర్ణాలు గెలుచుకుంది. కామన్వెల్త్, ఆసియా క్రీడలలో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్ గా కూడా నిలిచింది. 2016లో అర్జున అవార్డు, 2020లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, 2019లో లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ నామినేషన్, 2022 లో బీబీసి  ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు నామినేషన్ ఇలా ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి. రెజ్లింగ్‌లో అద్భుతమైన ఎత్తులకు ఎదిగింది. 

ఇదంతా వినేశ్ ఫోగాట్ జీవితానికి ఒక వైపు. ఈమె కెరియర్‌‌లో రెండో వైపు కూడా ఉంది. కేవలం దేశాలకు పతకాలను తేవడమే తన బాధ్యత అనుకుని ఆగిపోలేదు వినేశ్. క్రీడల్లో మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా గొంతెత్తింది. పెద్ద పెద్దవారిని సైతం ఎదురించింది. రాజకీయంగా తొక్కేయాలని చూసినా..ఎక్కడా తగ్గలేదు. మహిళా రెజర్ల మీద లైగింకవేధింపులు ఆరోపణలతో ఒకప్పటి బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ మీద వినేశ్ ఫోగాట్ అలుపెరుగని పోరాటం చేసింది. ఆ సమయంలో ఆమెకు చాలా కొద్ది మంది మాత్రమే సపోర్ట్‌గా నిలిచారు. ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయలేదు. అన్యాయాన్ని ఎదిరించేందుకు తాను ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఖేల్ రత్న అవార్డును కూడా వెనక్కు తిరిగి ఇచ్చేసింది. సాధించిన పతకాలన్నీ గంగానదిలో విసిరేస్తానని చెప్పింది. అయినా  రెజర్లకు న్యాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దానికి తోడు వినేశ్ కెరీర్ ఖతం అయిపోయిందని అన్నారు. ఇలాంటి విషయాలపై దృష్టి పెడితే నీకే తలపోట్లు.. అంటూ విద్వేషకారులు విషం చిమ్ముతున్నా.. ఆమె వెనుకడుగు వేయలేదు. అన్యాయం చేసినవాళ్ళు కాలరెగరేసుకుని దర్జాగా తిరుగుతుంటే ఆవేశంతో రగలిపోయింది. తరువాత ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది. పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే క్రమంలో.. జూనియర్‌ చేతిలో ఓడితే ఇక నీ ఆట ఖతం అంటూ అవహేళన చేశారు. కన్నీళ్ళు పెట్టుకుంది. కానీ తనలోనే ఆవేశాన్ని మాత్రం చంపుకోలేదు. కష్టపడి ఒలింపిక్స్‌కు అర్హత సాధించి..ఫైనల్స్ వరకు వెళ్ళింది. 

అయితే అక్కడ ఆమెకు గట్టి దెబ్బ తగిలింది. ఒలింపిక్స్‌లో సెమీస్‌లో గెలిచి ఫైనల్స్‌కు వెళ్ళిన మొట్టమొదటి మహిళా రెజ్లర్‌‌గా చరిత్ర సృష్టించింది వినేశ్. కానీ ఒక్క రోజులోనే అన్నీ తారుమారు అయిపోయాయి. పతకం మాట అటుంచి కనీసం ఒలింపిక్స్‌లో కూడా లేకుండా చేశారు. 100 గ్రాముల బరువు అధికంగా ఉందంటూ ఆమెపై అనర్హత వేటు వేశారు. ఇందులో వినేశ్ తప్పు ఏమీ లేదు. ఎవరో చేసిన తప్పుకు ఆమె బలైపోయింది. ఆమె చుట్టూ ఉన్నవారే ఆమెకు గోతులు తీశారు. వినేశ్ ను పోటీకి సిద్ధం చేయాల్సిన డాక్టర్లు, కోచ్, న్యూట్రిషియన్లు ఆమె బరువు పెరగడానికి కారణం అయ్యారు. సెమీస్‌కు ముందు 49.9 కేజీల ఉన్న వినేశ్ ఒక్క రాత్రిలో రెండు కేజీలు పెరిగిపోయింది. న్యూట్రిషియన్, డాక్టర్ ఆమెకు కేవలం మంచినీరు మాత్రమే ఇచ్చాము అని చెబుతున్నారు. రాత్రంతా ఆమెకు నీరు ఇవ్వలేదు. ఎక్సర్సైజ్ చేయించారు. అయినా కూడా ఆమె తగ్గలేకపోయింది. దీంతో వినేశ్ ను ఒలింపిక్స్ నుంచి అనర్హురాలిగా ప్రకటించారు. అది ఆమె మొత్తం కెరియర్‌‌ మీదనే ప్రబావం చూపించింది. ఈ ఓటమిని వినేశ్ జీర్ణంచుకోలేకపోయింది. రెజ్లింగ్ కెరియర్‌‌కు గుడ్‌ బై చెప్పేసింది. ఇంకెప్పుడు ఆడను అంటూ ఉద్వేగంగా పోగాట్ పెట్టింది. ఒలింపిక్స్ టైమ్‌లో ప్రధాని మోదీ కాల్ చేసినా పట్టించుకోలేదు. 

ఓడిన చోటే గెలిచి...

ఒలింపిక్స్‌లో వినేశ్‌ను అనర్హురాలిగా చేసిన విజయం సాధించాము అనుకున్నారు ఆమె శత్రువులు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే ఆమె పడి లేచిన కెరటం. ఎంత కిందకి పడితే అంత ఎత్తుకు లేస్తుంది. ఇంతకు ముందు కూడా ఇదే జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఉవ్వెత్తున ఎగిసి చూపించింది వినేశ్. క్రీడలకు స్వస్తి చెప్పిన వినేశ్ తన పోరాటాన్ని అంత తేలికగా ముగించాలనుకోలేదు. అక్కడి నుంచి రాగానే నేరుగా రాజకీయాల్లోకి ఎంటర్ అయింది. కాంగ్రెస్‌లో జాయిన్ అయింది. ఈ విషయంలో తోటి క్రీడాకారుల నుంచి.. సొంత పెదనాన్న, అక్కల నుంచి వ్యతిరేకత వచ్చినా వెనుకడగేయలేదు. కాంగ్రెస్ తరుఫు నుంచి టికెట్ సంపాదించి హ్యరానా ఎన్నికల్లో పోటీ చేసింది.

హర్యానాలో ఎన్నికల హంగామా మొదలైన దగ్గర నుంచీ వినేశ్ గెలుస్తుందనే అంచనాలున్నాయి. ఆమె మీ ఒలింపిక్స్‌లో అనర్హురాలు వేటు పడినా...కెరియర్‌‌లో ముందుకు వెళ్ళలేకపోయినా...ప్రజల మనసుల్లో మాత్రం ఎప్పటికీ చెరిగిపోలేని స్థానాన్ని సంపాదించుకోవడంలో మాత్రం వెనుకబడలేదు. వినేశ్ పారిస్ నుంచి వచ్చినప్పుడు ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.అడుగడుగునా తమ మద్దతు తెలిపారు. ఇప్పుడు మళ్ళీ హర్యానా ఎన్నికల్లో కూడా మె వైపే ప్రజలు నిలిచారు. ఇక్కడ మొత్తంలో కాంగ్రెస్ ఓడిపోయినా...వినేశ్ మాత్రం గెలిచింది. తన సత్తా ఏమిటో మరొకసారి నిరూపించింది. తనను కిందకు పడిపోయేలా చేసి గెలిచామనుకుని సంతోషపడి వారికి చెంపచెళ్ళుమనేలా సమాధానం చెపింది. 

వినేశ్ ఫోగాట్ జీవితంలో అన్ని సంఘటనలూ  సస్సెన్స్ తో కూడుకున్నవే. ఒలింపిక్స్‌ లో అనర్హత వేటు పడినప్పుడు  కొన్ని రోజుల పాటూ తనకు న్యాయంగా రావాల్సిన మెడల్ కోసం ఆమె పోరాటం చేసింది. సీఏఎస్‌లో కేసు వేసి చివరి వరకూ ఎదురు చూసింది.  కానీ అక్కడ ఆమె పోరాటం ఫలించలేదు. మెడల్ వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఇప్పుడు హర్యానా ఎన్నికల్లో కూడా వినేశ్ గెలుపు కాసేపు దోబూచులాడింది. మెడల్ లానే ఎన్నికల్లో గెలుపు కూడా చేతి వరకూ వచ్చి వెళిపోతుందా అనే సందేహాలు కలిగించింది. కౌంటంగ్ మొదలైన దగ్గర నుంచి ఆధిక్యం కనబరిచిన వినేశ్ కాసేపటి తర్వాత బాగా డౌన్ అయిపోయింది. అందరూ ఆమె పని అయిపోయింది, ఓడిపోయింది అనే అనుకున్నారు. కానీ మళ్ళీ అనూహ్యంగా పుంజుకుని గెలుపు బావుటా ఎగురవేసింది. ఎప్పుడూ న్యాయమే గెలుస్తుందని నిరూపించింది. 

Also Read: Haryana Results: ఈవీఎం ట్యాంపరింగ్ తోనే బీజేపీ గెలుపు.. కాంగ్రెస్ సంచలన ఆరోపణలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు