/rtv/media/media_files/2025/01/16/PcePe6Omwr4QtZrXlx3r.jpg)
solar
planet Parade: వచ్చే నెలలో ఆకాశంలో అద్భుతం జరగబోతుంది.టెలిస్కోప్ లేకుండా ఏడు గ్రహాలను ఒకేసారి చూసే అవకాశం రాబోతుంది.వాటిని భూమి నుంచి చూసినప్పుడు ఒకే సరళ రేఖ పై ఉన్నట్లు కనపడతాయి. 'ప్లానెట్ పరేడ్'గా పిలిచే ఈ ఖగోళ అద్భుతం ఫిబ్రవరి 28న ఆవిష్కృతం అవ్వబోతుంది. అయితే అంతకంటే ముందే జనవరిలోనే భారత దేశంలో ఈ ప్లానెట్ పరేడ్‌ను చూసే అవకాశాలు కనపడుతున్నాయి.
Also Read: Global Risks Report: 2025లో ప్రపంచానికి పొంచిఉన్న ముప్పులివే..
కానీ అప్పుడు ఆరు గ్రహాలు మాత్రమే కనిపించనున్నాయి.ఈ ప్లానెట్ పరేడ్‌లో అంగారకుడు, బృహస్పతి, శని, శుక్రడు, నెప్ట్యూన్, యురేనస్- ఈ ఆరు గ్రహాలు ఒకే వరుసలోకి రాబోతున్నాయి. అమెరికా, మెక్సికో, కెనడా, భారత దేశ ప్రజలు ఈ అరుదైన దృశ్యాన్ని చూస్తారని తెలుస్తుంది. ఇది జనవరి 21 నుంచి 31 వరకు ఉంటుంది. కానీ జనవరి 25 మాత్రం మరింత దగ్గరగా కనిపించే అవకాశాలున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. రాత్రి సమయంలో వీటిని చూడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also Read: TG: రైతు భరోసాపై పకడ్బంది ప్లాన్.. సాగుచేయని భూమిని ఎలా గుర్తిస్తారంటే
ఏడు గ్రహాలు ఒకే వరుసలోకి..
అయితే శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలను ఎటువంటి ప్రత్యేక పరికరాలను లేకుండానే చూడొచ్చు. కానీ నెప్ట్యూన్, యురేనస్‌ను టెలిస్కోప్ ద్వారా మాత్రమే స్పష్టంగా చూడటం సాధ్యమవుతుంది. ముందుగా జనవరి 19న శుక్రుడు, శని గ్రహాలు ఒక వరుసలోకి రానున్నాయి. ఆ తర్వాత జనవరి 21న సాయంత్రం శుక్రుడు బృహస్పతి, యురేనస్, నెప్ట్యూన్ ఒకే వరుసలోకి రానున్నాయి. ఫిబ్రవరి 28న బుధుడు శుక్రడు, అంగారకుడు, బృహస్పతి, శని, నెప్ట్యూన్, యురేనస్ ఏడు గ్రహాలు ఒకే వరుసలోకి రాబోతున్నాయి.
ఇలా ఏడు గ్రహాలు కనిపించే ప్లానెట్ పరేడ్ అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి దృశ్యం చివరిసారిగా 2022లో ఆవిష్కృతం అయింది. ఈ ప్లానెట్ పరేడ్ రాత్రి సమయంలో కొద్ది సేపు మాత్రమే కనపడుతుంది. కొండలు లేదా బహిరంగ ప్రదేశాలు, తక్కువ కాంతి ఉండే ప్రాంతాల నుంచి చూడవచ్చు. టెలిస్కోప్ ఉంటే ఈ గ్రహాలను మరింత స్పష్టంగా చూడటానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
Also Read:Mutton free: ఇంటింటికీ ఫ్రీగా మటన్.. కనుమ సందర్భంగా బంపర్ ఆఫర్!
Also Read: Maha Kumbh: కుంభమేళా ఎఫెక్ట్.. విమాన టికెట్ ధరలు చుక్కల్లోనే