/rtv/media/media_files/2026/04/15/samrat-choudhary-sworn-2026-04-15-12-32-25.jpg)
Bihar CM: బీహార్ రాజకీయ చరిత్రలో బుధవారం ఓ కీలక మలుపు చోటుచేసుకుంది. బీజేపీ సీనియర్ నాయకుడు సామ్రాట్ చౌదరి రాష్ట్ర 21వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని లోక్ భవన్‌లో జరిగిన వేడుకలో గవర్నర్ సయ్యద్ అత హస్నైన్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఈ పరిణామంతో బీహార్‌లో సుదీర్ఘకాలం కొనసాగిన నితీష్ కుమార్ శకానికి తెరపడింది. విశేషమేమిటంటే, బీహార్ రాష్ట్ర చరిత్రలో బీజేపీ తరఫున ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన మొట్టమొదటి నాయకుడిగా సామ్రాట్ చౌదరి రికార్డు సృష్టించారు.
Bihar Historic Shift!
— The Alternate Media (@AlternateMediaX) April 15, 2026
Samrat Choudhary sworn in as Bihar's first BJP Chief Minister in Patna after Nitish Kumar's resignation.#BiharNewCMpic.twitter.com/PQCli5sYKt
మంత్రుల ప్రమాణ స్వీకారం
సామ్రాట్ చౌదరితో పాటు జేడీయూ (JD-U) ఎమ్మెల్యేలు విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్‌లు కూడా క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
Also Read: గ్లోబల్ స్టేజ్‌పై "బాహుబలి ఆత్మ" కథ.. రాజమౌళి మరో సంచలనం..!
బీజేపీ విజయయాత్రలో మరో మైలురాయి
సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారంతో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రాబల్యం మరింత పెరిగింది. ప్రస్తుతం దేశంలో బీజేపీకి 16 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. దేశంలోని 19 రాష్ట్రాల్లో బీజేపీ సంకీర్ణ లేదా సొంత ప్రభుత్వాలను నడుపుతోంది. బీజేపీ చరిత్రలో చౌదరి 57వ ముఖ్యమంత్రిగా నిలిచారు.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి కీలక హిందీ రాష్ట్రాల్లో ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీకి, బీహార్‌లో సొంత ముఖ్యమంత్రి పీఠం దక్కడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చాలా కాలం పాటు బీహార్ రాజకీయాలను శాసించిన నితీష్ కుమార్, మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, హోం శాఖ మంత్రిగా కీలక పాత్ర పోషించిన సమ్రాట్ చౌదరిని మంగళవారం ఎన్డీఏ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు.
Also Read: "సార్... వన్ మోర్ ఛాన్స్ ప్లీజ్!" బుచ్చిబాబు కామెంట్ వైరల్!
సామ్రాట్ చౌదరి నియామకంలో కుల సమీకరణలు కూడా కీలక పాత్ర పోషించాయి. బీహార్‌లో ప్రభావవంతమైన కోయిరీ సామాజిక వర్గం నుండి ముఖ్యమంత్రి అయిన రెండో నాయకుడు ఈయనే. 1968లో సతీష్ ప్రసాద్ సింగ్ కేవలం ఐదు రోజులు మాత్రమే ఈ పదవిలో ఉన్నారు. 1968లో జన్మించిన చౌదరి రాజకీయ కుటుంబం నుండి వచ్చారు. ఆయన తండ్రి శకుని చౌదరి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా, తల్లి పార్వతీ దేవి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. 1990లో రాజకీయాల్లోకి వచ్చిన చౌదరి.. ఆర్జేడీ, జేడీయూ వంటి పార్టీల్లో పనిచేసి, 2017లో బీజేపీలో చేరారు. అనతి కాలంలోనే పార్టీలో కీలక నేతగా ఎదిగి, నేడు రాష్ట్ర పగ్గాలు చేపట్టారు.
Follow Us