సైఫ్ పై దాడి వెనుక బిష్ణోయ్ గ్యాంగ్.. వెలుగులోకి సంచలన విషయాలు!

కృష్ణజింకను వేటాడాడనే కోపంతోనే బిష్ణోయ్ గ్యాంగ్ సైఫ్‌పై దాడి చేసిందా అనే అనుమానం నెలకొంది.  బిష్ణోయ్‌ కోణంలోనూ ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణ చేపడుతున్నారు.  ఇంతకుముందు  బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ఇంటిపై దాడికి దిగడంతో ఈ ఊహాగానాలకు తావిస్తోంది.  

New Update
saif ali khan mumbai

saif ali khan mumbai Photograph: (saif ali khan mumbai)

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటన కలకలం సృష్టిస్తోంది.  ఈ ఘటన దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపేడేలా చేసింది.  దీంతో ఈ ఘటన వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఏమైనా ఉందే అనుమానం నెలకొంది.  జైపూర్ కృష్ణ జింకను వేటాడిన కేసులో... 1998లో సల్మాన్ ఖాన్‌తో పాటు సైఫ్‌ పైనా కూడా కేసు నమోదైంది.   కృష్ణజింకను వేటాడాడనే కోపంతోనే బిష్ణోయ్ గ్యాంగ్ సైఫ్‌పై దాడి చేసిందా అనే అనుమానం నెలకొంది.  బిష్ణోయ్‌ కోణంలోనూ ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణ చేపడుతున్నారు.  ఇంతకుముందు  బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ఇంటిపై దాడికి దిగడంతో ఈ ఊహాగానాలకు తావిస్తోంది.  

సల్మాన్ ఖాన్ కు జైలు శిక్ష

1998 అక్టోబర్‌లో ‘హమ్ సాథ్ సాథ్ హై’  షూటింగ్ టైమ్ లో  సల్మాన్‌ ఖాన్‌తో పాటుగా  బాలీవుడ్ నటులు టబు, సోనాలి బింద్రే, సైఫ్ అలీ ఖాన్, దుష్యంత్ సింగ్, నీలమ్ కొఠారిలు కృష్ణజింకలను వేటాడారని కేసు నమోదైంది.   ఈ కేసులో జోధ్‌పూర్ కోర్టు  హీరో సల్మాన్ ఖాన్ కు జైలు శిక్ష విధించింది. మిగతావారిని నిర్దోషులుగా ప్రకటించింది. రెండు రోజుల పాటు జైల్లోనే ఉన్న సల్మాన్‌ ఆ తరువాత బెయిల్ పై రిలీజ్ అయ్యారు. 

సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనతో అత‌డు నివాసం ఉంటున్న బాంద్రా ప్రాంతం సుర‌క్షిత‌మేనా అని ఇప్పుడు సందేహలు వ‌స్తున్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతంలో మూడు ఎటాక్ లు జరిగాయి.  స‌ల్మాన్ ఖాన్‌తో పాటుగా అతని మిత్రుడు మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని ఇటీవ‌లే కాల్చి చంపింది. వీటికి తోడు ఇప్పుడు సైఫ్ పై దాడి  ఘ‌ట‌న షాక్‌కి గురిచేసింది. 

 బాంద్రా ప్రాంతం సెలబ్రేటీలు ఉండే  నివాసాలకు ప్రసిద్ధి చెందింది. సైఫ్ అలీ ఖాన్, సల్మాన్ ఖాన్‌లతో పాటు,  షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, రణబీర్ కపూర్, సంజయ్ దత్, రేఖ, జీనత్ అమన్, అనన్య పాండే, ఫర్హాన్ అక్తర్ , సైరా బానో తదితరులు ఇక్కడే నివ‌సిస్తున్నారు.   ఇప్పుడు సైఫ్‌ఫై జరిగిన ఘ‌ట‌న‌లు చూస్తుంటే.. బాంద్రా ప్రాంతం సుర‌క్షిత‌మేనా అనే ప్ర‌శ్న‌లు తలెత్తుతున్నాయి.  ఇప్పుడు సైఫ్‌ఫై జరిగిన ఘ‌ట‌న‌లు చూస్తుంటే.. బాంద్రా ప్రాంతం సుర‌క్షిత‌మేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

Also Read :  టార్గెట్ సైఫా లేక పిల్లలా? .. సీసీ టీవీ ఫుటేజ్‌లో కీలక విషయాలు!

#mumbai #salman-khan #larence-bisnoy-gang #Attack on saif ali khan
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు