నిన్న నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దూరిన చొరబాటుదారుడు అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఇందులో సైఫ్ వెన్నెముక, మెడ , చేతికి గాయాలయ్యాయి. వెన్నెముకలో బలంగా కత్తి గుచ్చుకోవడంతో అందులో ఉన్న ద్రవం చాలా పోయింది. దీనికి లీలావతి ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ చేశారు. ఇది కాకుండా సైఫ్ మెడ, చేతులకు కూడ ప్లాస్టిక్ సర్జరీలను నిర్వహించారు. ఆపరేషన్ల తర్వాత సైఫ్ ఇప్పటివరకు కళ్ళు తెరవలేదు. యితే అతని పరిస్థితి నిలకడగానే ఉండడంతో రూమ్‌లో ఉంచారు. కానీ ఆపరేషన్ అయి దాదాపు రోజు గడిచినా సైఫ్ ఇంకా కళ్ళు తెరవకపోవడం, దేనికీ రెస్పాండ్ కాకపోవడంతో అతనిని తిరిగి ఐసీయూకు తరలించారు. మరోవైపు అతనికి మెరుగైన ట్రీట్మెంట్ కోసం ఫారెన్ డాక్టర్లను తీసుకురావాలని సైఫ్ కుటుంబసభ్యులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read : హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో డీమార్ట్, రిలయన్స్ ట్రెండ్స్!
Also Read : Game Changer: గేమ్ ఛేంజర్ పై కుట్ర చేసింది వీళ్లే.. ఆరుగురి అరెస్ట్!
నిందితుడిని పట్టుకున్నారు..
ఇక నటుడు సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో అనుమానితుడిని అరెస్ట్ చేశామని ముంబై పోలీసులు ప్రకటించారు. సీసీటీవీ కెమెరాలు, సైఫ్ ఇంట్లో సిబ్బంది ఇచ్చిన ఆధారాల పరంగా అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. నిందితుడిని మంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తించామని పోలీసులు తెలిపారు. అతడిని విచారిస్తే గానీ పూర్తి వివరాలు చెప్పలేమని అన్నారు. సైఫ్ ఇంట్లోకి చొరబడిన దొంగ తాలూకా ఇమేజ్ సీసీటీవీ కెమెరాల్లో దొరికింది. దానిక తోడు ఇంట్లోని పని వారు దొంగ ఎలా ఉంటాడు, ఏం బట్టలు వేసుకున్నాడు లాంటి వివరాలను క్లియర్‌గా చెప్పారు.
Also Read: J&K: జమ్మూలో అంతుచిక్కని జబ్బు..ఇప్పటి వరకు 15 మంది మృతి
Also Read : పవన్ ఫ్యాన్స్ కి పూనకాలే.. 'హరిహర వీరమల్లు' లో పవన్ పాడిన పాట వచ్చేసింది!