Makara Jyothi: శబరిమలలో మకరజ్యోతి దర్శనం.. LIVE
కేరళలోని శబరిమలలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా భక్తులకు మకరజ్యోతి దర్శనమిచ్చింది. దీంతో స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో శబరిమలలు మారుమోగిపోయాయి.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ షాకిచ్చింది. ఈ కేసు దర్యాప్తులో జప్తు చేసిన రూ.661 కోట్ల స్థిరాస్తులను స్వాధీనం చేసుకునేందుకు తాజాగా నోటీసులు జారీ చేసింది.
Rahul gandhi and Sonia Gandhi
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) షాకిచ్చింది. ఈ కేసు దర్యాప్తులో జప్తు చేసిన రూ.661 కోట్ల స్థిరాస్తులను స్వాధీనం చేసుకునేందుకు తాజాగా నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. ఢిల్లీ, ముంబయి, లక్నోలోని ఆస్తులపై ఈ మేరకు నోటీసులు అతికించినట్లు ఓ ప్రకటనలో చెప్పింది.
Also Read: ఇవేం బల్లులురా మావా...ఒక్కటి అమ్మితే చాలు లైఫ్ సెటిలైనట్లే..
సంబధిత ఆస్తులను ఖాళీ చేయాలని.. లేదా వాటికి వచ్చే అద్దెలను బదిలీ చేయాలని చెప్పింది. PMLA చట్టం కింద ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. అయితే నేషనల్ హెరాల్ట్ పత్రికకు అసోసియేటెడ్ జర్నర్స్ (AJL) ప్రచూరణకర్తగా ఉంది. దీనికి ‘యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్’ యాజమాన్య సంస్థ. సోనియా, రాగుల్ గాంధీలతో పాటు మరికొందరు పార్టీ నేతలు ఇందులో ప్రమోటర్లుగా ఉన్నారు. కాంగ్రెస్‌కు ఏజేఎల్ బకాయి పడ్డ రూ.90.21 కోట్లను వసూలు చేసుకునే అంశంలో యంగ్ ఇండియన్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయనే ఆరోపణలున్నాయి. దీనిపైనే ఈడీ దర్యాప్తు చేస్తోంది.
Also read: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?
అయితే 2023 నవంబర్‌లో సంబంధిత స్థిరాస్తులతో పాటు ఏజేఎల్‌లో ఈక్విటీ షేర్ల రూపంలో ఉన్న యంగ్ ఇండియన్‌కు చెందిన రూ.90.21 కోట్లు జప్తు చేసింది. ఈ కేసులో సోనియా, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత పవన్ కుమార్ బన్సల్‌ను ఇప్పటికే ఈడీ విచారణ చేసింది. వాళ్ల స్టేట్‌మెంట్లు కూడా రికార్డ్ చేసింది. తాజాగా దానికి సంబంధించిన స్థిరాస్తులు స్వాధీనం చేసుకునేందుకు నోటీసులు పంపించింది.
Also Read: సూట్ కేసులో లవర్‌ను దాచి.. హాస్టల్ రూమ్‌లోకి తీసుకెళ్లేందుకు స్కెచ్.. భలే దొరకాడుగా!
telugu-news | rtv-news | enforcement-directorate | national-news