Mamata Banerjee : అభిషేక్ బెనర్జీపై దాడి: హాస్పిటల్ సీఈఓను బెదిరించిన మమతా బెనర్జీ.. ఆడియో లీక్‌!

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి సంబంధించిన ఒక ఆడియో క్లిప్ ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. కోల్‌కతాలోని ఒక ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్ సీఈఓను ఆమె ఫోన్‌లో తీవ్రంగా మందలించారు.

New Update
mamata

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి సంబంధించిన ఒక ఆడియో క్లిప్ ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. కోల్‌కతాలోని ఒక ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్ సీఈఓను ఆమె ఫోన్‌లో తీవ్రంగా మందలిస్తూ, బెదిరింపులకు పాల్పడినట్లు ఉన్న ఆడియో సోషల్ మీడియాలో లీక్ అయింది. మమతా బెనర్జీ మేనల్లుడు  అభిషేక్ బెనర్జీపై సోనార్‌పూర్‌లో ఒక గుంపు దాడి చేసిన మరుసటి రోజే ఈ ఆడియో క్లిప్ బయటకు రావడం గమనార్హం. దాడి అనంతరం అభిషేక్ బెనర్జీ చికిత్స కోసం సదరు హాస్పిటల్‌లోనే చేరారు.

తప్పుడు పనులు చేస్తున్నారు

వైరల్ అవుతున్న ఆ ఆడియో రికార్డింగ్‌లో.. బెల్ వ్యూ హాస్పిటల్ సీఈఓ ప్రదీప్ టాండన్‌పై మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తప్పుడు పనులు చేస్తున్నారంటూ హెచ్చరించినట్లు వినపడుతోంది. "సారీ మిస్టర్ టాండన్, మీరు చాలా తప్పుడు పని చేశారు. గతంలో మేము మీకు ఎలాంటి సాయం చేశామో గుర్తుందిగా. దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు, మీకు సిగ్గుండాలి. మీ అహంకారాన్ని అందరూ గుర్తుపెట్టుకుంటారు. హాస్పిటల్ నడుపుకుంటూ.. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉందనా మీ ఆటలు? రేపు కేంద్రంలో ఆ ప్రభుత్వం లేకపోతే, మీ సంగతి మేమే చూసుకుంటాం" అని మమత సదరు సీఈఓను బెదిరించినట్లు ఆ ఆడియోలో ఉంది.

రాజకీయ ప్రత్యర్థులు అభిషేక్ బెనర్జీపై.. కోల్‌కతా సమీపంలోని సోనార్‌పూర్‌లో ఘోరమైన దాడి జరిగింది. ఎన్నికల అనంతర హింసలో నష్టపోయిన బాధితుల కుటుంబాలను పరామర్శించడానికి ఆయన అక్కడికి వెళ్లగా.. భారీ సంఖ్యలో వచ్చిన జనం ఆయనపై రాళ్లు, కోడిగుడ్లు విసిరారు.దొంగ.. దొంగ అంటూ నినాదాలు చేశారు. ఈ దాడి తీవ్రరూపం దాల్చడంతో.. అభిషేక్ చొక్కా చిరిగిపోయింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు ఇచ్చిన క్రికెట్ హెల్మెట్ ధరించి, తన భద్రతా సిబ్బంది సాయంతో ఆయన ఎలాగోలా అక్కడి నుంచి ప్రాణాలతో తప్పించుకున్నారు.

ఈ దాడి అంతా బీజేపీ చేయించిందేనని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. "ఇదంతా బీజేపీ స్పాన్సర్ చేసిన దాడి. ప్రజాస్వామ్యానికి వాళ్లు ఇచ్చే గౌరవం ఇదేనా? నన్ను చంపాలనే ఉద్దేశంతోనే ఈ దాడి చేశారు. అసలు అక్కడ పోలీసులు ఎక్కడా కనిపించలేదు" అని ఆయన మీడియాతో అన్నారు. దాడి తర్వాత అభిషేక్ బెనర్జీని మొదట అపోలో హాస్పిటల్‌కు, ఆ తర్వాత అక్కడి నుంచి బెల్ వ్యూ హాస్పిటల్‌కు తరలించారు.

Advertisment
తాజా కథనాలు