రతన్ టాటాకు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో తెలుసా?

ప్రస్తుతం టాటా గ్రూప్ కింద 29 లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. ఈ 29 కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్‌ను పరిశీలిస్తే.. ఆగస్టు 20, 2024 నాటికి దాదాపు రూ. 33.7 లక్షల కోట్లు.  టాటా మొత్తం నికర విలువ కేవలం రూ. 3,800 కోట్లు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..

New Update

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పారిశ్రామిక సంస్థ టాటా గ్రూప్. ఈ సంస్థ అధినేత రతన్ టాటా ఇకపై లేరు. అయితే ఎన్నో కంపెనీలుగా విస్తరించిన టాటా గ్రూప్ ఆస్తులు ఎంత? ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి?. అయితే, రతన్ టాటా ఆస్తుల గురించి మాట్లాడితే.. ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే. ప్రస్తుతం టాటా గ్రూప్ కింద 29 లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. ఈ 29 కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్‌ను పరిశీలిస్తే.. ఆగస్టు 20, 2024 నాటికి దాదాపు రూ. 33.7 లక్షల కోట్లు. 

66 శాతం దేశం కోసమే..

ఆయన మొత్తం నికర విలువ కేవలం రూ. 3,800 కోట్లు. ఇలా చూస్తే, సంస్థ ఆదాయం ఎక్కడికి వెళుతుందనే ప్రశ్న తలెత్తుతుంది?. కానీ, టాటా గ్రూప్‌లోని అన్ని కంపెనీలు టాటా ట్రస్ట్ కిందకు వస్తాయి, దీని హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్. ఈ సంస్థ తన అన్ని సంస్థల మొత్తం ఆదాయంలో 66 శాతాన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు, దేశం, ప్రజల కోసం ఖర్చు చేస్తారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు