Ratan Tata: రతన్ టాటాతో చివర వరకూ ఉన్న టీటో..వీలునామాలో పేరు వీధి శునకాల కోసం తపన పడి...వాటి కోసమే పెద్ద ఆసుపత్రి కట్టించిన రతన్ టాటా...న పెంపుడు శునకాన్ని వదిలేస్తారా. ఆయన చనిపోయినా తన కుక్క టీటో మాత్రం బావుండాలని ముందుగానే ఆలోచించారు. అందుకే తన వీలునామాలో టీటోకు కూడా కల్పించారు. By Manogna alamuru 25 Oct 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Ratan Tata Pet Dog: రతన్ టాటాకు జంతువులు అంటే ఎనలేని ప్రేమ. దాంతోనే ఆయన ముంబైలో అతి పెద్ద యానిమల్ హాస్పిటల్‌ను కూడా పెట్టారు. అంతేకాదు తన దగ్గర ఉండే టీటో అంటే ఆయనకు పంచ ప్రాణాలు. రతన్ టాటా అంత్యక్రియలప్పుడు కూడా ఈ టీటోను అందరూ చూసే ఉంటారు. ఆయన మృత దేహంతో పాటూ చివరి వరకూ ఉన్న ఈ మూగజీవి...రతన్ జీవితంలో ప్రముఖ స్థానాన్నే సంపాదించుకుంది. అందుకే తన వీలునామాలో కూడా టీటో పేరు ప్రస్తావించారు. టీటో జీవితకాల సంరక్షణ ఖర్చుల కోసం అమౌంట్‌ను ఇవ్వాలని ఆయన తన వీలునామాలో రాశారు. శునకం మొత్తం బాధ్యతలను తన వద్ద ఎంతోకాలంగా పని చేసిన వంటమనిషి రాజన్ షాకు అప్పగించరని తెలుస్తోంది. ప్రస్తుతమున్న టీటో రతన్ టాటా రెండో పెంపుడు శునకం. అంతకు ముందు కూడా ఇదే పేరుతో మరో కుక్క ఉండేది. అది చనిపోయాక ఇప్పుడు ఉన్నదాన్ని పెంచుకోవడం మొదలుపెట్టారు. అయితే రెండింటికి ఒకటే పేరు మాత్రం పెట్టుకున్నారు రతన్. Also Read: Stock Market: మళ్ళీ మార్కెట్ ఢమాల్..సూచీలు 24, 200 దిగువకు Also Read: పొంగులేటి చెప్పిన పొలిటికల్ బాంబ్ ఏంటి? కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ అవుతారా? రతన్ టాటా తన పెంపు శనకాన్నే కాదు...తన దగ్గర పని చేస్తూ సహాయకులుగా ఉన్నవారిని కూడా మర్చిపోలేదు. వంటమనిషి, సహాయకులుగా ఉన్న రాజన్ షా, సుబ్బయ్యల పేర్లను కూడా తన వీలునామాలో చేర్చారు టాటా. రతన్ మొత్తం ఆస్తి విలువ దాదాపు రూ.10,000 కోట్లు. ఈ మొత్తాన్ని.. ఆయన నెలకొల్పిన ఫౌండేషన్‌లను అన్నింటినీ.. సోదరుడు జిమ్మీ టాటాకు, తన సహాయకులు, ఇతరులకు చెందుతాయని వీలునామాలో రాసినట్లుగా చెబుతున్నారు. ఇది కూడా చదవండి: Kishan Reddy: దమ్ముంటే కూల్చు.. రేవంత్ కు కిషన్ రెడ్డి సంచలన సవాల్! Also Read: తెలంగాణలో మరో ఎయిర్‌పోర్ట్.. త్వరలో పనులు షురూ! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి