/rtv/media/media_files/2026/04/09/raghav-chadha-2026-04-09-18-59-02.jpg)
AAP leader Raghav Chadha hints at floating Gen-Z party
ఎంపీ రాఘవ్ చద్దాకు బిగ్ షాక్ తగిలింది. ఆయన తీసుకున్న రాజకీయ నిర్ణయం సోషల్ మీడియా ఫాలోయింగ్‌పై తీవ్రమైన ప్రభావం చూపింది. ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు రాఘవ్ చద్దా.అయితే కేవలం 24 గంటల వ్యవధిలోనే ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఏకంగా 11 లక్షల మంది ఫాలోవర్లను కోల్పోయింది.
ఆయన బీజేపీలో చేరే ప్రకటనకు ముందు 14.2 మిలియన్లుగా ఉన్న ఆయన ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా 13.1 మిలియన్లకు పడిపోయింది. రాఘవ్ చద్దా పార్టీకి ద్రోహం చేశారని భావిస్తున్న వాలంటీర్లు, మద్దతుదారులు కావాలనే ఆయనను అన్‌ఫాలో చేస్తున్నారని ఆప్ ఎమ్మెల్యే సంజీవ్ ఝా విమర్శించారు. కేవలం ఆకర్షణీయమైన రీల్స్ చేయడం వల్ల ప్రజాదరణ దక్కదని, ప్రజలు ఆయన చర్యను ఇష్టపడటం లేదని ఆప్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
మూడింట రెండు వంతుల మంది
మరోవైపు ఈ ఫిరాయింపులపై ఆమ్ ఆద్మీ పార్టీ చట్టపరమైన పోరాటానికి సిద్ధమైంది. రాజ్యసభలో పార్టీకి ఉన్న మొత్తం బలాబలాల్లో మూడింట రెండు వంతుల మంది ఎంపీలు అంటే ఏడుగురు సభ్యులు ఒక్కసారిగా బిజెపిలో చేరడాన్ని ఆప్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం చెల్లదని, ఈ విలీనం అక్రమమని పార్టీ వాదిస్తోంది. ఈ మేరకు రెబల్ ఎంపీలందరిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ రాయాలని ఆప్ నిర్ణయించింది. రాజకీయంగా బిజెపిలో చేరి బలపడాలని చూస్తున్న రాఘవ్ చద్దాకు, అటు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఇటు చట్టపరంగా ఆప్ నుండి గట్టి సవాళ్లు ఎదురవుతున్నాయి.
Follow Us