Hindi controversy: పవన్ కళ్యాణ్‌ను వదిలిపెట్టని ప్రకాశ్‌రాజ్.. Xలో సెటైర్ల వర్షం

పవన్ కళ్యాణ్ తమిళనాడు హిందీ వివాదంపై చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఎప్పటి లాగే జస్ట్ ఆస్కింగ్ అంటూ వపన్‌పై సెటైర్లు వేశారు. హిందీ మా మీద రుద్దకండని అంటే మరోభాషను ద్వేషించడం కాదని ఆయన అన్నారు. ఇది పవన్‌కు చెప్పడని Xలో పోస్ట్ చేశారు.

New Update
pk with prakash raj

pk with prakash raj Photograph: (pk with prakash raj)

జనసేన 12వ ఆవిర్భవ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ తమిళనాడులో కొనసాగుతున్న హిందీ వివాదంపై మాట్లాడారు. భారతదేశానికి బహుభాషా విధానం అవసరమని ఆయన అన్నారు. తమిళనాడు సహా అన్నీ రాష్ట్రాలు ఒకే సిద్ధాంతంపై ఉండాలని కోరారు. దేశ ఐక్యతకు బహుభాష విధానం ఉండాలని సూచించారు. తమిళనాడులో హిందీ వద్దు అనేది అన్యాయమని పవన్ కళ్యాణ్ ఖండించారు. ఈ వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ప్రకాశ్‌రాజ్ తనదైన స్టైల్‌లో బహుభాష విధానంపై పవన్‌కు కౌంటర్ ఇచ్చాడు. ‘‘మీ హిందీ భాషను మా మీద రుద్దకండి", అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడమని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి’’ అని ప్రకాశ్‌రాజ్ ఎక్స్‌లో ట్విట్ చేశారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్విట్ చేశారు.

Also read: TDP నాయకుడు దారుణ హత్య.. వేటకొడవళ్లతో నరికి నరికి

ప్రకాశ్‌రాజ్ పవన్ కళ్యాణ్‌పై సెటరికల్ కామెంట్స్ చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో తిరుపతి లడ్డూ, సనాతన దర్మం విషయాల్లో కూడా ప్రకాశ్ రాజ్ పవణ్ కళ్యాణ్‌ను విభేదిస్తూ జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్విట్లు చేశారు. ప్రస్తుతం కేంద్ర అమలు చేయాలనుకుంటున్న త్రీ లాంగ్వేజ్ రూల్‌ను పవన్ కళ్యాణ్ సమర్థించారు. గత కొన్ని రోజులు తమిళనాడు అధికార పార్టీ డీఎంకే దీన్ని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న విషయం తెలిసిందే. హిందీ విషయంలో తమిళనాడులో హిందీ వద్దు అనడం అన్యాయమని అన్నారు. మరి తమిళ సినిమాలు హిందీలోకి ఎందుకు డబ్బింగ్ చేస్తు్న్నారని ప్రశ్నించారు. రూపీ సింబర్ తమిళంలోకి మార్చుకోవడాన్ని తప్పుబడ్డారు. మిమ్మల్ని చూసి అన్నీ రాష్ట్రాలూ మార్చుకోవాలా అని వవన్ ప్రశ్నించారు. దీంతో ఎప్పటిలాగూ ప్రకాశ్ రాజ్ పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ట్వీచ్ చేశారు.

 Also read: Firing: కాంగ్రెస్ మాజీ MLAపై కాల్పులు.. ఇంటిపై నలుగురు అటాక్

Advertisment
Advertisment
Advertisment