/rtv/media/media_files/2025/04/02/VJLqU8fxtX6FNwZQNXdd.jpg)
RBI Deputy Governor Photograph: (RBI Deputy Governor )
Reserve Bank of India : భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్ గుప్తాను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో డిప్యూటీ గవర్నర్‌గా ఉన్న ఎండీ పాత్రా ఈ ఏడాది జనవరిలో వైదొలగడంతో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ పదవి ఖాళీగా ఉంది. మూడేళ్ల కాలానికి ఆమె నియమకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించగా, ఆమె పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం పూనమ్ గుప్తా దేశంలోనే అతిపెద్ద ఆర్థిక విధానాల పరిశోధనా సంస్థ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్‌సీఏఈఆర్) డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. అలాగే, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యురాలు, 16వ ఆర్థిక సంఘానికి సాహా మండలి కన్వీనర్‌గా కూడా ఉన్నారు.
Also Read: యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియాకు షాక్.. సుప్రీం కోర్టు కీలక ప్రకటన
021లో ఎన్‌సీఏఈఆర్‌లో చేరడానికి ముందు, ఆమె వాషింగ్టన్, డీసీలోని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్‌లో దాదాపు రెండు దశాబ్దాలు సీనియర్ స్థాయిలో పనిచేశారు. ఆమె ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ (యూఎస్)లో కూడా ప్రొఫెసర్‌గా, ఢిల్లీలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్ఐ)లో విజిటింగ్ ఫ్యాకల్టీగా పనిచేశారు. పూనమ్ గుప్తా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్ఐపీఎఫ్‌పీ)లో ఆర్‌బీఐ చైర్ ప్రొఫెసర్‌గా, ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ (ఐసీఆర్ఐఈఆర్)లో ప్రొఫెసర్‌గా ఉన్నారు. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్, యూఎస్ నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ తీసుకున్నారు. అలాగే ఢిల్లీ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 1998లో అంతర్జాతీయ ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ పరిశోధనకు గానూ ఆమెకు ఎగ్జిమ్ బ్యాంక్ బహుమతి లభించింది.
Also Read: ఈ సారి ట్రంప్ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు!