BIG BREAKING : ప్రధాని నరేంద్ర మోదీ సంచలన రికార్డు.. నెహ్రూ రికార్డు బద్దలు!

దేశ చరిత్రలోనే వరుసగా అత్యధిక కాలం ప్రధాని పదవిలో కొనసాగిన ఏకైక నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఈ క్రమంలో దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న దశాబ్దాల కాలం నాటి రికార్డును మోదీ బద్దలు కొట్టారు.

New Update
pm modi

భారత రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించబడింది. దేశ చరిత్రలోనే వరుసగా అత్యధిక కాలం ప్రధాని పదవిలో కొనసాగిన ఏకైక నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఈ క్రమంలో దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న దశాబ్దాల కాలం నాటి రికార్డును మోదీ బద్దలు కొట్టారు.

సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏర్పడిన ప్రభుత్వాల లెక్కలను పరిశీలిస్తే.. 1952లో దేశంలో మొదటిసారిగా ఎన్నికలు జరిగాక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన జవహర్‌లాల్ నెహ్రూ, వరుసగా 4,398 రోజుల పాటు ఆ పదవిలో కొనసాగారు. కాగా, 2014 మే 26న మొదటిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ.. వరుసగా 2019, ఆపై 2024 ఎన్నికల్లో గెలిచి మూడోసారి కూడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన పదవీకాలం నాటికి 4,399 రోజులకు చేరుకోవడంతో నెహ్రూ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. గతేడాది జూలైలోనే మోదీ.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరిట ఉన్న అత్యధిక కాలం (వరుసగా 4,077 రోజులు) పనిచేసిన రికార్డును కూడా అధిగమించిన సంగతి తెలిసిందే.

మొత్తం 6,130 రోజులు ప్రధానిగా

భారత ప్రధానమంత్రుల మొత్తం పదవీకాలాలను పరిశీలిస్తే.. జవహర్‌లాల్ నెహ్రూ తన జీవితకాలంలో మొత్తం 6,130 రోజులు ప్రధానిగా పనిచేశారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఆయన మొదటిసారి ప్రధాని అయ్యారు. ఆ తర్వాత దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన 1952, 1957, 1962 సార్వత్రిక ఎన్నికల అనంతరం కూడా ఆయనే ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి, 1964లో మరణించే వరకు ఆ పదవిలో కొనసాగారు.

మరోవైపు నెహ్రూ కుమార్తె, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రెండు వేర్వేరు పర్యాయాల్లో కలిపి మొత్తం 5,829 రోజుల పాటు ప్రధానమంత్రిగా సేవలు అందించారు. ఆమె 1966లో తొలిసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించి 1977 వరకు (మొదటి పర్యాయంలో 4,077 రోజులు) నిరంతరాయంగా కొనసాగారు. ఆ తర్వాత మధ్యలో విరామం వచ్చి, మళ్లీ 1980 ఎన్నికలలో ఘనవిజయం సాధించి రెండోసారి ప్రధాని అయ్యారు. ఆమె తన రెండో పర్యాయంలో 1,752 రోజులు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ప్రస్తుతం నరేంద్ర మోదీ సాధించిన ఈ తాజా మైలురాయి దేశంలోనే అత్యంత సుదీర్ఘమైన నిరంతరాయ ప్రధాని పాలనగా చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది.

Advertisment
తాజా కథనాలు