Delhi: ఉగ్రవాదానికి భారత్ బదులిస్తుంది–మోదీ ఉగ్రవాదానికి ధీటుగా భారత్ సమాధానమిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాజ్యాంగమే మనకు మార్గదర్శి అని చెప్పారు. By Manogna alamuru 26 Nov 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి భారతదేశం రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్ళు గడిచింది. దీనిని పురస్కరించుకుని ఢిల్లీలోని సుప్రీంకోర్టులో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ప్రధాని మోదీతో పాటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా పాల్గొన్నారు. రాజ్యాంగమే మనకు మార్గదర్శి. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్ళయింది. భారత రాజ్యాంగం కాల పరీక్షకు నిలిచింది. రాజ్యాంగం అంటే కేవలం పత్రం కాదు.. ప్రజాస్వామ్య దీపిక. రాజ్యాంగం, రాజ్యాంగ నిర్మాతలకు శిరస్సువంచి నమస్కరిస్తున్నా అంటూ మోదీ మాట్లాడారు. దేశంలో అన్ని చోట్లా రాజ్యాంగమే అమలు అవుతుందని గట్టిగా చెప్పారు. జమ్మూ–కాశ్మీర్లో ఇప్పుడు రాజ్యాంగం పూర్తిగా అమలులోకి వచ్చింది. ఇప్పుడు అక్కడ ఉగ్రవాదానికి ధీటుగా బదులిస్తామని మోదీ హెచ్చరించారు. అన్నింటికన్నా, అందరికన్నా దేశమే ముందు అన్న భావనను రాజ్యాంగం సజీవంగా ఉంచుతుంది అని మోదీ అన్నారు. ముంబయి మారణ హోమం దుర్ఘటన ఇదే రోజు జరిగింది.. ఆ విషాద ఘటనలో మృతిచెందిన వారికి నివాళులర్పిస్తున్నా అని అన్నారు. Also Read: HYD: జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం...ఇంకా అదుపులోకి రాని మంటలు మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి