PM Modi: హెడ్‌లైన్‌గా మారిన ఛావా.. మూవీపై పీఎం ప్రశంసలు

మరాఠా పాలకుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఇటీవల విడుదలైన ఛావా సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అయితే ప్రధాని మోదీ ఈ సినిమాపై ప్రశంసంలు కురిపించారు. ఛావా సినిమా ప్రస్తుతం హెడ్‌లైన్‌గా మారిందన్నారు.

New Update
Modi compliment to Chhaava

Modi compliment to Chhaava Photograph: (Modi compliment to Chhaava)

PM Modi: ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు, మరాఠా పాలకుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఛావా ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విక్కీ కౌశల్ శంభాజీ క్యారెక్టర్‌లో నటించాడు. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టడంతో పాటు మంచి హిట్ టాక్‌ను సంపాదించుకుంది. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ జీవించేశాడు. అయితే ఈ సినిమాపై తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు.

ఇది కూడా చూడండి: ఇంటర్ విద్యార్థులకు బిగ్ షాక్.. సెలవులు కుదింపు

ఇది కూడా చూడండి: MK Stalin:దేని మీద రాళ్లు రువ్వుతున్నారో గమనించుకోండంటూ స్టాలిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

గొప్ప దళిత సాహిత్యాన్ని..

ఇటీవల జరిగిన 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ఛావా సినిమా గురించి మాట్లాడారు. ఛావా సినిమా ప్రస్తుతం హెడ్‌లైన్‌గా మారిందని పీఎం తెలిపారు. దేశంలో మరాఠీ భాష చాలా గొప్ప దళిత సాహిత్యాన్ని అందించిందన్నారు. మహారాష్ట్ర ప్రజలు గతంలో ఆయుర్వేదం, సైన్స్, లాజికల్ రీజనింగ్‌కి వంటి వాటికి అద్భుతమైన కృషి చేశారు. మహారాష్ట్ర, ముంబై కేవలం హిందీ సినిమాలు మాత్రమే కాకుండా మరాఠీ చిత్రాల స్థాయిని పెంచడంలో కీలక పాత్ర పోషించిందన్నారు.

ఇది కూడా చూడండి:Horoscope: ఈరోజు ఈ రాశివారు డబ్బు నష్టపోయే అవకాశాలున్నాయి..జాగ్రత్త!

శంభాజీ మహారాజ్ స్టోరీపై వచ్చిన ఛావా సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మొత్తం ఛావా రూ.219.75 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే కేవలం హిందీ భాషలోనే రిలీజ్ అయిన ఈ సినిమా మిగతా అన్ని భాషల్లో కూడా తీసుకురావాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి:  Kamal Hasan: ఆలస్యంగా రావడం వల్లే ఓటమి..20 ఏళ్ల ముందే వచ్చి ఉంటే కథ వేరేలా ఉండేది!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు