/rtv/media/media_files/2025/11/19/pm-kisan-2025-11-19-06-36-03.jpg)
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ 22వ విడత నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2026 మార్చి 13వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాంలోని కోక్రాఝర్ లో పర్యటించనున్నారు. అందులో భాగంగా ఒకే క్లిక్‌తో రైతుల ఖాతాల్లోకి ఈ నగదును జమ చేయనున్నారు. గత కొన్ని రోజులుగా ఈ నిధులు ఎప్పుడు వస్తాయో అన్న ఉత్కంఠకు తెర దించుతూ ప్రభుత్వం అధికారికంగా ఈ తేదీని ఖరారు చేసింది. దీంతోత రైతుల చేతుల్లోకి రెండు వేల రూపాయలు అందనున్నాయి. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే పీఎం కిసాన్ పోర్టల్‌లో సరిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు సంవత్సరానికి ₹6,000 ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ మొత్తాన్ని మూడు సమాన వాయిదాలుగా (ఒక్కొక్కటి రూ.2,000) ప్రతి నాలుగు నెలలకు ఒకసారి నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తారు. ఈ ప్రక్రియను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) అంటారు.
కొత్తగా నమోదు చేసుకునే విధానం
ఈ పథకంలో చేరడానికి రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ముందుగా pmkisan.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
హోమ్ పేజీలో 'New Farmer Registration' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
అక్కడ అడిగిన వివరాలు (ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ వంటివి) నమోదు చేయాలి.
ఆ తర్వాత భూమికి సంబంధించిన వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు కూడా అప్‌లోడ్ చేయాలి.
మీ పీఎం కిసాన్ బెనిఫిషియరీ స్టేటస్ చెక్ చేసుకోవడానికి, pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి చేక్ చేసుకోవచ్చు.
అవసరమైన అన్ని డాక్యుమెంట్లు (భూమి పత్రాలు, బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్ కార్డ్) స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
చివరగా దరఖాస్తును సబ్మిట్ చేయాలి.
మీ పేరు ఉందో, లేదో చూడాలన్నా
పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన స్టేటస్ తెలుసుకోవాలన్న లేకా పీఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూడాలన్నా https://pmkisan.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఆయా వివరాలు పొందడానికి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. పీఎం కిసాన్ మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది. ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందే రైతుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. పీఎం కిసాన్ ఆన్‌లైన్ పోర్టల్‌లో స్వయంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.
Follow Us