/rtv/media/media_files/2026/05/05/screenshot-2026-05-05-10-11-18.jpg)
Vijay and Prashant Kishor
TVK : తమిళనాడులో TVK సునామీ సృష్టించింది. అయితే ఆ సునామీ పేరు విజయ్ దళపతి అయితే.. దానిని డ్రైవ్ చేసింది మాత్రం ప్రశాంత్ కిషోర్. CSK కి ధోనీ కింగ్ అయితే.. TVKకే నేనే కింగ్ మేకర్ అన్నాడు పీకే. సరిగ్గా ఏడాది కిందట.. ప్రశాంత్ కిషోర్ మాటలు ఈరోజు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అది 2025 ఫ్రిబ్రవరి 26.. తమిళనాడులోని మహబలిపురంలో భారీగా ఏర్పాటు చేసిన స్టేజ్. స్టేజ్ ముందు లక్షలాది మంది జనం.. స్టేజ్ పైన ఒక హీరో, ఆయన పక్కన రాజకీయంలో జనం నాడి పట్టుకునే డైరెక్టర్. అయితే వీరిద్దరూ కలిసి తీసిన సినిమా ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతేకాదు ఈ బొమ్మ సూపర్ హిట్. వాలెట్ బాక్సులు విజిల్ గుర్తుతో నిండిపోయాయి.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో హీరో విజయ్ చక్రం తిప్పాడు. 232 నియోజకవర్గాల్లో సింగల్ పార్టీ అభ్యర్థులు 100కు పైగా స్థానాల్లో అధిక్యంలో ఉన్నారు. పార్టీ పెట్టి సంవత్సరాలైతున్నా పది సీట్లు కూడా గెలవలేక పోయిన రాజకీయ నాయకులున్నారు. కానీ పార్టీ పెట్టిన రెండేళ్లలో విజయ్ ఏకంగా ముఖ్యమంత్రి సీటే ఎక్కనున్నారు. ఇంత తక్కువకాలంలో విజయ్ ఈ పెద్ద విక్టరీ వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నాడని తెలుస్తోంది. తమిళగ వెట్రి కజగం తొలి వార్షికోత్సవ సమావేశానికి ప్రశాంత్ కిషోర్ వచ్చారు. ఆ సభలో ఆయన ఏం చెప్పారో అదే ఇప్పుడు జరిగింది. ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రం బిహార్‌లో సొంత పార్టీతో గెలవలేక పోయాడు కానీ ఆయన చాలా రాష్ట్రాల్లో అనుకున్న వారిని సీఎం కూర్చిల్లో కూర్చొబెట్టారు.
IPLలో తమిళనాడు టీం కెప్టెన్ ధోనీ. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీ 15 ఏళ్లకు పైగా కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆయన సారథ్యంలో సీఎస్‌కే 5 సార్లు IPL ట్రోఫీ గెలిచింది. ఉమ్మడి బిహార్ రాష్ట్రానికి చెందిన ధోని లాగే తాను కూడా తమిళనాడులో పాపులర్ అవుతానని ప్రశాంత్ కిషోర్ చెప్పాడు. TVK మొదటి వార్షికోత్సవ సభలో ప్రశాంత్ కిషోర్ చెప్పిన జోస్యం ఇప్పుడు నిజమైంది. 2025 ఫిబ్రవరి 26న ఆయన ఏమన్నారో ఇప్పడు చూద్దాం..
ధోనీ CSKని ఎలాగైతే గెలిపిస్తారో.. నేను TVKని అలాగే గెలిపిస్తాను. ఆ తర్వాత తమిళనాడులో ధోనీ కంటే నా పాపులారిటీ పెరిగిపోతుంది" అంటూ ఆయన సరదాగా అన్నా.. అందులో గట్టి నమ్మకం కనిపించింది. అప్పట్లో అది కేవలం మాటలే అనుకున్నా.. ఇప్పుడు ఎన్నికల రిజల్ట్స్ చూస్తుంటే PK చెప్పింది చెప్పినట్టు చేసి చూపిస్తున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
తమిళనాట ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో సీట్లు గెలుచుకున్న ఐదవ పార్టీగా తమిళగ వెట్రి కజగం అవతరించింది. ఇందులో ఎక్కువగా సినీ గ్లామర్‌తో వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు. కరుణానిధి, జయలలిత, స్టాలిన్, ఇప్పుడు విజయ్ దళపతి. 1971 అసెంబ్లీ ఎన్నికల్లో ఎం. కరుణానిధి పార్టీ డీఎంకే ఏకంగా 184 సీట్లు గెలుచుకుంది. ఇప్పటి వరకు తమిళనాడు ఎన్నికల చరిత్రలో ఒకే పార్టీ సాధించిన అత్యధిక సీట్ల సంఖ్య ఇదే. తర్వాత 1991లో జయలలిత నాయకత్వంలో AIADMK 164 నియోజకవర్గాల్లో విజయ కేతనం ఎగురవేసింది. 1996లో ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీకి 173 నియోజవకర్గాల్లో గెలిచింది. రిసెంట్‌గా 2021 ఎన్నికల్లో ఎం.కె. స్టాలిన్ DMK సింగల్ పార్టీతో 133 స్థానాల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు విజయ్ టీవీకే అభ్యర్థులు 108 నియోజకవర్గాల్లో విజయం సాధించారు. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అవడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది...? అయితే ఆయన విజయానికి కారణం ఏవరనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి..?
Follow Us