/rtv/media/media_files/2025/02/20/HOgrzBJ6c3JJSS2Jxzme.jpg)
delhi new cabinet
దేశ రాజధాని ఢిల్లీలో నేడు బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. సీఎం రేఖా గుప్తాతో పాటుగా ఆరుగురు మంత్రలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు, ఢిల్లీ కేబినెట్‌లో ఉండే మంత్రుల జాబితా రిలీజ్ అయింది. మంత్రుల జాబితాలో ముఖ్యమంత్రి రేసులో నిలిచిన ప్రవేశ్ వర్మ, ఆశిష్ సూద్, మంజీందర్ సింగ్ సిర్సా, కపిల్ మిశ్రా, పంకజ్ సింగ్, రవీంద్ర రాజ్ పేర్లు ఉన్నాయి. ప్రమాణ స్వీకారం అనంతరం వీరందరూ పీఎం మోదీతో కలిసి లంచ్ చేయనున్నారు. రామ్ లీలా మైదానంలో మధ్యాహ్నం 12 గంటలకు జరగనున్న ఈ ప్రమాణస్వీకారోత్సవ వేడుకకకు ప్రధాని మోదీతో పాటుగా పలువురు కేంద్రమంత్రలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రలు, 50 మంది సెలబ్రేటీలు, వ్యాపారవేత్తలు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read : అబ్బా మళ్ళీ కొట్టాడు..ఔషధాలపై 25శాతం సుంకం ప్రకటన..కుప్పకూలిన ఫార్మా స్టాక్స్
ఢిల్లీకి నాలుగో సీఎం
47 ఏళ్ల ప్రవేశ్ వర్మ జాట్ కులానికి చెందినవారు. ఇటీవల జరిగిన న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను 4 వేల 89 ఓట్ల తేడాతో ఓడించారు. ఇక సిక్కు నాయకులలో ఒకరిగా ప్రసిద్ధి చెందిన శిరోమణి అకాలీదళ్ నేత మంజీందర్ సింగ్ సిర్సా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ధన్వతి చందేలాను 18 వేల190 ఓట్ల తేడాతో ఓడించారు. కాగా ఢిల్లీ పీఠాన్ని ఇప్పటివరకూ ముగ్గురు మహిళలు అధిరోహించగా మరికాసేపట్లో రేఖా గుప్తా.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి వారి సరసన చేరనున్నారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆమెకు సీఎం ఛాన్స్ రావడం గొప్ప విషయమేనని చెప్పాలి. దేశంలో మమతా బెనర్జీతో పాటుగా రేఖా గుప్తా రెండో మహిళా ముఖ్యమంత్రి అవుతారు. అలాగే ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆమె ఏకైక మహిళా ముఖ్యమంత్రి కానున్నారు.
Also Read : ఒంటరితనం భయంకరంగా ఉందట.. రెండో పెళ్లిపై హింట్ ఇచ్చిన సమంత
Also Read : నేడు బంగ్లాదేశ్‌తో టీమిండియా మ్యాచ్.. అన్ని రికార్డుల్లో మనమే టాప్ !
షాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిపై 30 వేల ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తా ఘన విజయం సాధించారు. కేజ్రీవాల్‌ను ఓడించిన మాజీ సీఎం కొడుకు, పర్వేశ్ శర్మను కాదని ఆమెకే ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తున్నారంటే ఆమె గొప్పతనం అక్కడే అర్థం చేసుకోవచ్చు. విద్యార్థి దశ నుంచే ఆమె పార్టీలో పని చేస్తూ వచ్చారు. రేఖా గుప్తా 1974లో హర్యానాలోని జింద్ జిల్లాలో నంద్‌గఢ్ గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్‌గా పని చేశారు. వారి కుటంబం ఢిల్లీకి వలస వచ్చారు. 1996లో రేఖా గుప్తా LLB పట్టా పొందారు.
Also Read : కేసీఆర్ పై కేసు వేసిన వ్యక్తి మర్డర్.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!