/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
దేశ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ఎన్నో ఆశల మధ్య లోక్‌సభ ముందుకు వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు (రాజ్యాంగ సవరణ బిల్లు) ఓటింగ్ దశలో చతికిలపడింది. ఈ బిల్లు చట్టంగా మారాలంటే సభలో మూడింట రెండొంతుల (2/3rd) మెజారిటీ సభ్యుల మద్దతు అవసరం. కానీ, జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి. దీనితో బిల్లు ఆమోదానికి కావాల్సిన మద్దతు లభించకపోవడంతో ఇది వీగిపోయినట్లు స్పీకర్ ప్రకటించారు. ఓటింగ్ ప్రక్రియలో మొత్తం 528 మంది సభ్యులు పాల్గొన్నారు. మెజారిటీ అవసరమైన 326 ఓట్లను ఎన్డీఏ సాధించలేకపోయింది. దీంతో మిగతా రెండు బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు.
Follow Us