పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసనల మధ్య ఉభయసభలు వాయిదా

పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళనలతో సోమవారం సమావేశాలు వాయిదా పడ్డాయి. అదానీ వ్యవహారంపై లోక్‌సభలో రాహుల్‌ గాంధీ సహా విపక్ష ఎంపీలంతా నిరసనకు దిగారు. ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. స్పీకర్‌ ఓం బిర్లా సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.

author-image
By K Mohan
New Update
pj

ప్రస్తుతం పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలను ఆదానీ వ్యవహారం, సంభల్‌ హింసాకాండ తదితర అంశాలు కుదిపేస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం సమావేశాలు ప్రారంభానికి ముందు పార్లమెంట్‌ ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు.

అదానీ వ్యవహారంపై లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సహా విపక్ష ఎంపీలంతా నిరసనకు దిగారు. ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అయితే, ఈ నిరసనలకు తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు హాజరుకాలేదు.

ఇదికూడా చదవండి :Kasturi: ఉద‌యించే సూర్యుడికి శ‌త్రువుగా ఉంది రెండాకుల గుర్తే..!

ఉభయసభలు ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే లోక్‌సభ మధ్యాహ్నం వరకు వాయిదా పడింది. ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీల ఎంపీలు నిరసనకు దిగారు. ప్రశ్నోత్తరాల సమయంలో పలు అంశాలను లేవనెత్తడంతో సభలో గందరగోళం నెలకొంది.

Also Read: మోహన్ బాబు, మనోజ్ మధ్య గొడవపై పోలీసుల వివరణ.. జరిగింది ఇదేనట

దీంతో స్పీకర్‌ ఓం బిర్లా సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. సభ తిరిగి 12 గంటలకు సమావేశం కానుంది. ప్రస్తుతం రాజ్యసభ కొనసాగుతోంది. రైల్వే సవరణ బిల్లు,  డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బిల్లు, బ్యాంకింగ్‌ చట్టాల బిల్లు ఈ రోజు ఉభయ సభల్లో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పశ్చిమ బెంగాల్‌లో హింస వెనుక ముఖ్యమంత్రి కుట్ర : కేంద్ర మంత్రి

వెస్ట్ బెంగాల్ సీఎంపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, యూపీ సీఎం యోగి ఆథిత్య నాథ్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రే రాష్ట్రంలో హింస ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్‌లో ఆమోదించిన చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయమని ఆమె ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు.

New Update
Union Minister Kiren Rijiju

వక్ఫ్‌ సవరణ చట్టాన్ని నిరసిస్తూ పశ్చిమబెంగాల్‌‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నిరసనలు ఉద్రిక్తంగా మారడంపై కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనల పేరుతో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జినే హింసను ప్రేరేపిస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్లమెంట్‌లో ఆమోదించిన చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయమని మమతా బెనర్జీ ఆ రాష్ట్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. ఏప్రిల్ 12 నుంచి  బెంగాల్‌లోని మాల్దా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను దిగ్బంధించారు. ఘర్షణల్లో ముగ్గురు మృతిచెందారు. మొత్తం 110 మంది నిరసనకారులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్కడి హింసలో ఉగ్ర సంస్థల కుట్ర ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి.

Also read: Toll charges: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

మమతా బెనర్జిపై ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా మండిపడ్డారు. వక్ఫ్‌ సవరణ చట్టానికి నిరసనగా రాష్ట్రంలో హింస చెలరేగుతుంటే.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తనకేమి పట్టనట్టుగా ఉన్నారని ఆయన విమర్శించారు. వారం రోజులుగా ముర్షిదాబాద్‌ మంటల్లో రగులుతుంటే సీఎం మాత్రం మౌనంగా ఉన్నారని ఆయన ఆరోపించారు. లౌకికవాదం పేరుతో రాష్ట్రంలో అల్లర్లను లేపేవారికి ఆమె పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని యోగీ అన్నారు. 

Also read: Waqf Amendment Bill: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025 వల్ల లాభాలు ఇవే..

Advertisment
Advertisment
Advertisment