Operation Kagar : నేటితో ముగిసిన ఆపరేషన్ కగార్‍ డెడ్‌లైన్..నెక్ట్స్ ఏంటీ?

ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశాన్ని వామపక్ష నక్సలిజం రహిత దేశంగా మారుస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా , వామపక్ష మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా ఆఫరేషన్‌ కగార్‌ను మొదలు పెట్టింది. కేంద్రం పెట్టిన గడువు ఈ రోజుతో ముగుస్తుంది.

New Update
Maoists

Maoists

Operation Kagar : ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశాన్ని వామపక్ష నక్సలిజం రహిత దేశంగా మారుస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా , వామపక్ష మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా ఆఫరేషన్‌ కగార్‌ను మొదలు పెట్టింది. కేంద్రం పెట్టిన గడువు ఈ రోజుతో ముగుస్తుంది. ఇప్పటికే ఆపరేషన్ కగార్  ద్వారా ఆయా రాష్ట్రాల్లో పెద్దెత్తున మావోలను భద్రతా దళాలు ఏరివేశాయి. మరికొందరు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే ఇంకొన్ని గంటల్లో లొంగిపోవాల్సి ఉంటుంది. లేదంటే భద్రతా దళాలు అంతమొందించే అవకాశం ఉంటుంది. కాగా -- నిన్న లోక్‌సభలో హోంమంత్రి అమిత్‌ షా సంచలన ప్రకటన చేశారు.-- మావోయిస్టుల కేంద్ర కమిటీనీ నిర్మూలించామని అమిత్‌షా స్పష్టం చేశారు.-- చర్చలతోనే సమస్యల పరిష్కారమని ఆయన వెల్లడించారు.-- ఆయుధాలు చేతపట్టే యోచన తగదని హెచ్చరిక జారీ చేశారు. నక్సల్స్‌ హింసలో 5 వేల మంది భద్రతా సిబ్బంది సహా 20వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని.. దీనికంతటికీ 60 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీ పాలనే కారణమని అమిత్ షా ఆరోపించారు.

మంగళవారంతో మావోల లొంగుబాటు కోసం కేంద్రం విధించిన గడువు ముగుస్తుంది. ఇప్పటికే దండకారణ్యం మొత్తం ఖాళీ అయినట్లుగా ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం అక్కడ అన్నల జాడలేవీ కనిపించడం లేదంటుంది.. అడువులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. దాదాపుగా మావోలంతా సరెండర్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీలో కీలకంగా పనిచేసిన పలువురు అగ్ర నేతలు మాత్రం విదేశాలకు పారిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.  మావోయిస్ట్ ఆగ్రనేత గణపతి-- ఇప్పటికీ సరెండర్ కాలేదు. ఆయన ఎక్కడ ఉన్నారు అన్న సమాచారం కూడా అటు లొంగిపోయిన మావోయిస్టులకు గానీ, ఇటు పోలీసులు ఇంటలిజెన్స్‌కు గానీ లేదు. ఆయన మాత్రమే కాదు -- ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల సంగతి ఏంటి? అనేది కూడా స్పష్ఠత లేదు.-- వారు లొంగిపోబోతున్నారా..? లేదా..? అనేది తెలియరాలేదు. డెడ్‌లైన్ ముగిసినందున మావోయిస్టుల ఎన్‌కౌంటర్లు ఇంకా కొనసాగుతాయా..? అనే  సందేహాలు అందరినీ వెంటాడుతున్నాయి.--

ఇదిలా ఉండగా-- ఇప్పటికే పలువురు మావోయిస్టు ముఖ్యనేతలు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మావోయస్టు తొలితరం నాయకులు, కేంద్ర కమిటీలో కీలకంగా ఉన్న నాయకులు ఉన్నారు. వారిలో దేవ్‌జీ, నూనె నరసింహారెడ్డి, మల్లా రాజిరెడ్డి, పాపారావు, మల్లోజుల వేణుగోపాల్‌ రావు, ఆశన్న, కంకణాల రాజిరెడ్డి. ఆజాద్‌ తదితరులున్నారు.-- గత ఏడాది నవంబర్ 18న హిడ్మా ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు పార్టీ పతనం మొదలైంది. ఇక మిగిలిన మావోయిస్టుల కోసం సాయుధ దళాలు అడవులను జల్లెడ పడుతున్నాయి.-- 15 వేల మంది సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ బలగాలతో గాలింపు చేపడుతున్నారు. అయితే ఒకవేళ మావోయిస్టులు చిక్కితే అరెస్ట్‌ చేస్తారా? లేదా వారిని కాల్చి చంపి ఎప్పటిలాగే ఎన్‌కౌంటర్‌ అని చెబుతారా అనేది అంతుబట్టడం లేదు. మొత్తం మీదా నేటితో మావోయిస్టు ఉద్యమం అంతమైనట్లేనని అటు ప్రభుత్వం.. ఇటు సామాన్యులు భావిస్తున్నారు. ఈ తరుణంలో ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే. ఏదేమైతే మొత్తానికి నేటితో మావో శకం ముగిసినట్లుగానే చెప్పొచ్చు.

Advertisment
తాజా కథనాలు