Delhi Blast: ఆ యువతి వల్లే ఢిల్లీ ఉగ్ర కుట్ర బయటపడింది.. ఒమార్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమార్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రేమ విఫలమైన ఓ యువతి తన మాజీ ప్రియుడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్లే ఢిల్లీ ఉగ్రవాద కుట్ర బయటపడిందని పేర్కొన్నారు. 23వ హిందుస్తాన్ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సమ్మిట్‌లో ఆయన వ్యాఖ్యలు చేశారు.

New Update
Omar Abdullah explains how Delhi blast plot uncovered

Omar Abdullah explains how Delhi blast plot uncovered

ఇటీవల దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా దీనికి సంబంధించి జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమార్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రేమ విఫలమైన ఓ యువతి తన మాజీ ప్రియుడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్లే ఢిల్లీ ఉగ్రవాద కుట్ర బయటపడిందని పేర్కొన్నారు. 23వ హిందుస్తాన్ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సమ్మిట్‌లో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితి లోతైన భద్రత లోపాలను ప్రతిబింబిస్తుందని అన్నారు. అనుమానితుల గురించి తనకు ఎలాంటి ముందస్తు సమాచారం రాలేదని తెలిపారు. 

జమ్మూకశ్మీర్‌లో ఓ యువతిని తన ప్రియుడు వదిలేడంతో ఆమె బాధపడిందని అన్నారు. అక్కడ వేర్పాటువాదులకు సంబంధించిన పోస్టర్లు తన మాజీ ప్రియుడు అతికించాడని ఆమె పోలీసులకు చెప్పినట్లు తెలిపారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆ నిందితుడి వెనుక మరికొందరు ఉన్నట్లు విచారణలో తేలిందని చెప్పారు. అందులో ఒక డాక్టర్‌కు కూడా వీళ్లతో సంబంధం ఉందన్నారు. ఈ ఉగ్రకుట్రలో భాగమైన ఆ డాక్టర్‌ను, ఈ నెట్‌వర్క్‌లో ఉన్న వాళ్లను పట్టుకునేలా ఈ దర్యాప్తు దారితీసిందని తెలిపారు.  

Advertisment
తాజా కథనాలు