AIADMK : పళనిస్వామికి దిమ్మతిరిగే షాక్.. స్పీకర్ సంచలనం!

తమిళనాడు శాసనసభ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. మే 13వ తేదీన జరిగిన ఓటింగ్‌లో టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన 21 మంది ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలపై ఎలాంటి అనర్హత చర్యలు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు.

New Update
palaniswamy

తమిళనాడు శాసనసభ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. మే 13వ తేదీన జరిగిన ఓటింగ్‌లో టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన 21 మంది ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలపై ఎలాంటి అనర్హత చర్యలు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పీకర్ ఈ విషయాలను వెల్లడించారు. పార్టీ విప్‌ను ధిక్కరించి ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేసిన ఆ 21 మంది ఎమ్మెల్యేలపై ఎలాంటి అనర్హత చర్యలు తీసుకోవద్దని ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి స్వయంగా తనను కోరినట్లు స్పీకర్ చెప్పారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ నిబంధనల ప్రకారం ఆ ఎమ్మెల్యేలు చేసిన తప్పును తాను క్షమించినట్లు పళనిస్వామి తనకు తెలిపారని స్పీకర్ వివరించారు.

ఎలాంటి వినతిపత్రం రాలే

అయితే, టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన మరో నలుగురు ఎమ్మెల్యేలపై మాత్రం అనర్హత వేటు వేయాలని ఎడప్పాడి పళనిస్వామి తనను కోరినట్లు స్పీకర్ తెలిపారు. ఈ నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన దరఖాస్తులు ప్రస్తుతం తన పరిశీలనలో ఉన్నాయని, చట్ట నిబంధనల ప్రకారం దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. ఇదే సమయంలో, అసెంబ్లీలో ఏఐఏడీఎంకే శాసనసభ పక్ష నాయకుడు ఎవరు అనే విషయంపై ఏమైనా నిర్ణయం తీసుకున్నారా అని విలేకరులు అడగగా, స్పీకర్ స్పందించారు. దీనికి సంబంధించి తన వద్దకు ఎలాంటి వినతిపత్రం రాలేదని, అందువల్ల ప్రస్తుతానికి ఆ ప్రశ్నే తలెత్తదని స్పీకర్ స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు