మహారాష్ట్రలో ఎగ్జిట్ పోల్స్ ఇవ్వని మేజర్ సంస్థలు..కారణం ఏమై ఉంటుంది?

మహారాష్ట్ర, జార్ఖండ్ లలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా రిలీజ్ అయ్యాయి. అయితే మహారాష్ట్రలో ఈసారి చిన్న సర్వే సంస్థలు తప్ప పెద్దవి ఏవీ అంచనాలను రిలీజ్ చేయలేదు. 

author-image
By Manogna alamuru
New Update
MH

Maharshtra Exit Polls: 

మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ఎన్నికల ప్రచారం, ఓటింగ్ హడావుడి ముగిసింది.  ఎగ్జిట్ పోల్స్ హడావుడి కూడా ఎండ అయింది. ఐదారేడు సర్వే సంస్థలు తమ ఫలితాల అంచనాలను రిలీజ్ చేశాయి. అయితే ఈసారి ఎగ్జిట్ పోల్స్‌లో బాగా నోట్ అయిన విషయం ఏటంటే..మహారాష్ట్రలో దాదాపు పెద్ద సర్వే సంసంథలు అన్నీ ఎగ్జిట్ పోల్స్ను ఇవ్వలేదు. ముఖ్యంగా మై యాక్సిస్ ఇండియా సర్వే అస్సలు దాని ఊసే ఎత్తలేదు. జార్ఖండ్‌లో రిలీజ్ చేసినా ఏదో తమ ట్విట్టర్, వెబ్ సైట్లలలో నిలీజ్ చేసుకుందే తప్ప. ఎక్కడా, ఏ టీవీ ఛానెల్ లేదా వార్తా సంస్థలకు తమ ఎన్నికల ఫలితాల అంచనాలను ఇవ్వలేదు. లోక్ శాహీ మరాఠీ, చాణక్య, సీఎన్ఎన్ న్యూస్ –18 లాంటివి మాత్రమే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్‌ను రిలీజ్ చేశాయి. మహారాష్ట్రాలో కొద్దో గొప్పో చెప్పుకోవాల్సి వస్తే పీపుల్ పల్స్ ఒకటే పెద్దదిగా చెప్పుకోవాలి. అవతల జార్ఖండ్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. 
 
ఓటర్ల నుంచి వ్యక్తిగతంగా అభిప్రాయాలు తీసుకుని ఎగ్జిట్‌ పోల్స్‌ గణాంకాలు రూపొందిస్తారు. చాలా సార్లు ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన ఫలితాలు నిజమయ్యాయి. ఇంతకు ముందు ఎలక్షన్స్ జరిగిన అన్ని చోట్లా అన్ని సర్వే సంస్థలూ తమ అంచనాలను రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం సైలెంట్‌గా ఉండిపోయాయి. దీనికి కారణం ఏమై ఉంటుందా అనే సందేహాలు మొదలయ్యాయి ఇప్పుడు. ఇండియాలో ఉత్తరప్రదేశ్ తర్వాత పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. రాజకీయాల పరంగా కూడా ఇది ముఖ్యమైన రాష్ట్రం. ఇక్కడ గెలుపోటములు ప్రముఖ పార్టీలన్నింటికీ చాలా అవసరం. ఈసారి ఎన్నికల్లో మహాయుతిని గెలిపించి మళ్ళీ అధికారంలోకి రావాలని బీజేపీ, రెండవ పెద్ద రాష్ట్రంలో పట్టు సాధించాలని ఇండియా కూటమి చాలా గట్టిగా ప్రయత్నించాయి.  

ఇప్పుడు మేజర్ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను ఇవ్వకపోవడంతో అందరిలో ఉత్కంఠత నెలకొంది. సర్వే సంస్థల మీద ప్రెజర్ ఏమైనా వచ్చిందా. ఎందుకు అంచనాలను రిలీజ్ చేయలేదు అనే అనుమానం పట్టుకుంది. ఇంతకు ముందు జరిగిన అసెంబ్లీ, సాధారణ ఎన్నికల తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌లో కొన్ని చోట్ల ఫలితాలు తారుమారు అయ్యాయి. సాధారణ ఎన్నికల్లో కూడా బీజేపీ 400 సీట్లు వస్తాయని చెప్తే..కేవలం 292 మాత్రమే వచ్చాయి. క్రితంసారి హర్యానాలో కాంగ్రెస్ కచ్చితంగా వస్తుంది అని చెప్పారు. కానీ అక్కడ బీజేపీ గెలిచింది. దీంతో అక్కడ కాంగ్రెస్ నేతలు ఏడ్చి గగ్గోలు పెట్టారు. గతేడాది మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్‌, తెలంగాణల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ తప్పని తేలింది. ఇప్పుడు ఈ కారణంగానే పెద్ద సర్వే సంస్థలు అన్నీ ఫలితాల అంచనాలను ఇవ్వలేదా అని అనుకుంటున్నారు. లేదా రాజకీయంగా వీటిపై ఏమైనా ఒత్తిడి ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా మ్యాట్రిజ్, యాక్సిస్ మై ఇండియా ల్లాంటి సర్వే సంస్థలు చాలా కామ్‌గా ఉండడం..కాంగ్రెస్ ఎగ్జిట్ ఫలితాల మీద సంచలన ప్రకటన చేయడం లాంటివి ఆసక్తిని కలిగిస్తున్నాయి. దీని వెనుక కారణాలతో పాటూ ఈ ఎన్నికల్లో కూడా ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలున్నాయా అనే ఉత్కంఠత రేపుతోంది. అందుకే పెద్ద సంస్థలు సర్వేలు రిలీజ్ చేయలేదా అని అనుకుంటున్నారు. మరోవైపు జార్ఖండ్‌లో యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసినప్పటికీ కేవలం తన వెబ్ సైట్‌కు మాత్రమే పరిమితం చేసుకుంది. 

Also Read: Maharashtra: మహాయుతి కూటమిదే అధికారం.. ఎగ్జిట్ పోల్స్ సంచలన లెక్కలివే!

Advertisment
Advertisment
తాజా కథనాలు