/rtv/media/media_files/2026/05/08/nida-khan-2026-05-08-07-00-59.jpg)
నాసిక్ TCS కార్యాలయంలో జరిగిన మత మార్పిడి వ్యవహారంలో కీలక నిందితురాలు నిదా ఖాన్‌ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్రపతి శంభాజీనగర్‌లోని నరేగావ్ ప్రాంతంలో ఉన్న ఒక ఫ్లాట్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి తలదాచుకున్న ఆమెను పోలీసులు పక్కా ప్లాన్ తో పట్టుకున్నారు.
నాసిక్ సిట్, ఛత్రపతి శంభాజీనగర్ పోలీసులు ఉమ్మడిగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. నిదా ఖాన్ ఉంటున్న ఫ్లాట్‌ను గత రెండు రోజులుగా నిఘాలో ఉంచిన పోలీసులు, ఆమెను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. నిదా ఖాన్ తాను గర్భవతినని, కాబట్టి తనకు ముందస్తు బెయిల్ కావాలని కోర్టును కోరినప్పటికీ.. న్యాయస్థానం మాత్రం ఆమెకు ఎటువంటి ఊరట ఇవ్వలేదు.
మతం మారమని ఒత్తిడి చేయడమే
అసలు ఈ కేసు నేపథ్యం చూస్తే.. నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగిని, డానిష్ షేక్ అనే వ్యక్తి పెళ్లి పేరుతో మోసం చేశాడని ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. నిదా ఖాన్ ఈ డానిష్ షేక్ సోదరి. ఆమె తన సహచర ఉద్యోగినిని మతం మారమని ఒత్తిడి చేయడమే కాకుండా, ఆమె మతంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే డానిష్ షేక్‌కు అంతకుముందే పెళ్లయిందనే విషయాన్ని కూడా ఆమె దాచిపెట్టిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కేసు విచారణలో భాగంగా మరికొందరు మహిళా ఉద్యోగులు కూడా ముందుకు వచ్చి, తమపై అక్కడ లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపించారు. హెచ్ఆర్ విభాగానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు వాపోయారు. ఇప్పటివరకు ఈ కేసులో ఏడుగురు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు టీసీఎస్ సంస్థ నిదా ఖాన్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. ఆమె కేవలం ప్రాసెస్ అసోసియేట్ గా పనిచేసిందని, రిక్రూట్‌మెంట్‌లో ఆమెకు ఎటువంటి సంబంధం లేదని సంస్థ స్పష్టం చేసింది. అంతర్గతంగా తమకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని కూడా కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం పోలీసులు నిదా ఖాన్‌ను నాసిక్ తరలించి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
Follow Us