/rtv/media/media_files/2026/03/12/monalisa-2026-03-12-15-43-44.jpg)
కుంభమేళాలో ఒక్క ఫోటోతో ఓవర్‌నైట్ సెలబ్రిటీగా మారిన మోనాలిసా భోసలే పెళ్లి ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. తన ముస్లిం ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను ఆమె వివాహం చేసుకోవడం పెను సంచలనానికి దారితీసింది. మతాంతర వివాహం కావడంతో మోనాలిసా తల్లిదండ్రులు ఈ పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో కేరళలోని తిరువనంతరపురంలో ఉన్న ఒక ఆలయంలో వీరిద్దరూ హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు. అయితే ఈ పెళ్లిపై సోషల్ మీడియా ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయింది.
ఒకవైపు ఈ వివాహంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం పెళ్లి మాత్రమే కాదు, ఇదొక 'లవ్ జిహాద్' అంటూ పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మోనాలిసాతో తొలి సినిమా నిర్మించిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు మంటలు రేపుతున్నాయి. మోనాలిసాను తాను గంగమ్మలా భావించానని, కానీ ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తనను డిప్రెషన్‌లోకి నెట్టిందని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. ఆమెను దళారీలు ట్రాప్ చేశారని, ఇది తిరుగుబాటు కాదు లవ్ జిహాద్ మాత్రమేనని ఆయన వాదిస్తున్నారు.
సమర్థిస్తూ భారీగా మద్దతు
మరోవైపు, మోనాలిసా నిర్ణయాన్ని సమర్థిస్తూ భారీగా మద్దతు లభిస్తోంది. ఒక పేద కుటుంబం నుంచి వచ్చి, కుంభమేళాలో అనుకోకుండా వైరల్ అయినప్పటికీ.. మోనాలిసా తన గతాన్ని మర్చిపోలేదని ఆమె అభిమానులు అంటున్నారు. వైరల్ కాకముందే ఆమె ఫర్మాన్ ఖాన్‌తో ప్రేమలో ఉందని, ఇప్పుడు ఫేమ్, డబ్బు వచ్చాక కూడా తన పాత ప్రేమికుడిని వదులుకోలేదని వారు గుర్తు చేస్తున్నారు. నేటి కాలంలో డబ్బు, హోదా చూసి ప్రేమను మార్చుకునే వారున్న తరుణంలో.. మోనాలిసా మాత్రం ప్రేమకే పెద్దపీట వేసిందని ఆమె సపోర్టర్స్ పోస్టులు పెడుతున్నారు.
కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని భావించి పోలీసుల రక్షణలో పెళ్లి చేసుకున్న ఈ జంటపై సోషల్ మీడియాలో చర్చ ఆగడం లేదు. ఒక వర్గం ఆమెను లవ్ జిహాద్ బాధితురాలిగా చూస్తుంటే, మరో వర్గం మాత్రం ఆమెను ఒక గెలుపు గుర్రంలా, తన ప్రేమ కోసం నిలబడిన ధైర్యవంతురాలిగా అభివర్ణిస్తోంది. ఏది ఏమైనా, కుంభమేళా బ్యూటీ పెళ్లి వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
Follow Us