BIG BREAKING: కేంద్రం సంచలన నిర్ణయం.. నీట్ రీ-ఎగ్జామ్.. టెలిగ్రాం బ్యాన్

NEET రీ-ఎగ్జామ్ నిర్వహణ నేపథ్యంలో 'టెలిగ్రామ్' యాప్‌పై కేంద్రం తాత్కాలికంగా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీ వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

New Update
BREAKING

BREAKING

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) రీ-ఎగ్జామ్ నిర్వహణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ 'టెలిగ్రామ్' యాప్‌పై కేంద్రం తాత్కాలికంగా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీ వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

ఈ నెల 21వ తేదీన నీట్ రీ-ఎగ్జామ్ జరగాల్సి ఉంది. ఈ పరీక్షకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ  నిర్ణయం తీసుకుంది. గతంలో నీట్ పరీక్షలకు సంబంధించిన పేపర్ లీకేజీ వ్యవహారాలు, లీకైన ప్రశ్నపత్రాల సర్క్యులేషన్, వివిధ రకాల గ్రూపుల ద్వారా అక్రమ సమాచారం చేరవేయడంలో టెలిగ్రామ్ యాప్ పెద్ద ఎత్తున దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యగా పరీక్షకు ఒక రోజు ముందు నుంచి, పరీక్ష ముగిసిన మరుసటి రోజు వరకు ఈ యాప్‌ను పూర్తిగా అందుబాటులో లేకుండా చేయాలని కేంద్రం నిర్ణయించింది.

సాధారణంగా టెలిగ్రామ్ యాప్‌లో పెద్ద పెద్ద ఫైళ్లను, ప్రశ్నపత్రాలను, స్టడీ మెటీరియల్స్‌ను గ్రూపులు, ఛానళ్ల ద్వారా ఒకేసారి వేలాది మందికి షేర్ చేయడానికి వీలుంటుంది. పైగా ఇందులో పంపించే వారి వివరాలు అంత త్వరగా బయటకు తెలియవు. ఈ ఫీచర్లను కొందరు కేటుగాళ్లు తప్పుడు పనులకు, పరీక్ష పేపర్లు లీక్ చేయడానికి వాడుకుంటున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ నెల 21న జరిగే రీ-ఎగ్జామ్ సమయంలో ఎలాంటి లీకేజీ పుకార్లు రాకుండా అడ్డుకోవడానికి, అక్రమాలకు తావులేకుండా పరీక్షను ప్రశాంతంగా జరగడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

Advertisment
తాజా కథనాలు