మహావికాస్ అఘాడి VS మహాయుతి.. కొలిక్కి వచ్చిన సీట్ల పంపకాలు ! మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. మహావికాస్ అఘాడి, మాహాయుతి కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ రెండు కూటముల పార్టీల మధ్య సీట్ల పంపకాలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 23 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. మహావికాస్ అఘాడి, మాహాయుతి కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మహావికాస్ అఘాడిలో కాంగ్రెస్, ఉద్ధవ్ బాలసాహెబ్ ఠాక్రే శివసేన (UBT), శరద్ పవార్ ఎన్సీపీ పార్టీలు ఉన్నాయి. మహాయుతిలో బీజేపీ, ఏక్‌నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీలు ఉన్నాయి. అయితే ఈ పార్టీల మధ్య సీట్ల పంపకాలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మహావికాస్ అఘాడి కూటమిలో సీట్ల కేటాయింపులపై చర్చలు చివరి దశకు చేరుకున్నాయి. యూబీటీ, శరద్‌పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్‌లు ఎన్నికకు తమ వ్యూహాలను రచిస్తున్నాయి. Also Read: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దీపావళికి స్పెషల్ 804 రైళ్లు ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ 105 నుంచి 110 స్థానాలు, శివసేన (UBT) 85 నుంచి 90 స్థానలు, ఎన్సీపీ(శరద్‌పవార్) 75 నుంచి 80 స్థానాల్లో పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. శరద్‌పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఇప్పటికే తమ అభ్యర్థులకు ఏ,బీ ఫారమ్‌లను పంపిణీ చేయడం మొదలుపెట్టాయని తెలుస్తోంది. మంగళవారం శరద్ పవార్ 17 ఏ,బీ ఫారమ్‌లు అలాగే ఉద్ధవ్ ఠాక్రే వర్గం 10 కంటే ఎక్కవ ఏ,బీ ఫారమ్‌లు పంపిణీ చేసినట్లు సమాచారం. బీజేపీకే ప్రాధాన్యం మరోవైపు మహాయుతి కూటమి చూసుకుంటే బీజేపీ 152 - 155 స్థానాలు, ఏక్‌నాథ్ షిండే శివసేన 78-80 స్థానాలు, అజిత్ పవార్ ఎన్సీపీ 52-54 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఇప్పటికే 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఫారమ్‌ల పంపిణీ ప్రక్రియను కూడా ప్రారంభించింది. శివసేన (ఏక్‌నాథ్ షిండే ) వర్గం మంగళవారం 45 సీట్లను ప్రకటించింది. ఈ అభ్యర్థులు బుధవారం నుంచి తమ ఏ,బీ ఫారమ్‌లు స్వీకరించనున్నారు. అలాగే అజిత్ పవార్ ఎన్సీపీ కూడా బుధవారం 38 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. పార్టీ అధినేత అజిత్ పవార్.. తన కుటుంబానికి కంచుకోట అయిన బారామతి స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రకటించింది. Also Read: 80 విమానాలకు బాంబు బెదిరింపులు నవంబర్ 20న మహారాష్ట్రంలో ఒకేదశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఓపైపు మహయుతి కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవాలని.. మరోవైపు మహావికాస్ అఘాడి కూటమి అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్రలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇక శివసేన 56 సీట్లు గెలుచుకోగా, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో గెలిచాయి. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల వల్ల శివసేన, ఎన్సీపీ పార్టీలు రెండుగా చీలిపోయి సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారు.. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చూనేది ఎవరూ అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. #eknath-shinde #uddav-thakrey #maharashtra election 2024 #assembly polls maharashtra మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి