/rtv/media/media_files/2026/04/21/lenskort-2026-04-21-11-36-02.jpg)
ప్రముఖ కళ్లజోళ్ల కంపెనీ లెన్స్‌కార్ట్ ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఆఫీసులో హిజాబ్ వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చి, హిందూ సంప్రదాయం ప్రకారం బొట్టు, తిలకం పెట్టుకోవద్దని కంపెనీ కండిషన్ పెట్టిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
BJP Leader Nazia Elahi Khan confronted staff at a Lenskart store in Mumbai over alleged discriminatory grooming policies.
— Megh Updates 🚨™ (@MeghUpdates) April 20, 2026
She was seen applying tilak to Hindu staff & raising “Jai Shri Ram” slogans. pic.twitter.com/JRiTFkH1bx
ముంబైలోని ఒక లెన్స్‌కార్ట్ షోరూమ్‌లోకి నాజియా ఇలాహీ అనే ముస్లిం(muslim) బీజేపీ నాయకురాలు తన అనుచరులతో కలిసి వెళ్లారు. అక్కడ పని చేసే సిబ్బందికి ఆమె స్వయంగా తిలకం దిద్ది, చేతికి కాశీ దారం కట్టారు. ఆ సమయంలో స్టోర్ లోపల జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అక్కడి మేనేజర్‌ను నిలదీస్తూ.. "హిందూ చిహ్నాలపై ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు?" అని ప్రశ్నించారు. ఇది హిందూ దేశమని, యాజమాన్యం క్షమాపణ చెప్పకపోతే లెన్స్‌కార్ట్ షాపులన్నీ మూసివేయిస్తామని హెచ్చరించారు.
ట్రైనింగ్ ఇచ్చే సమయంలో
అక్కడి కొందరు ఉద్యోగులు మాట్లాడుతూ.. కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చే సమయంలో తమకు తిలకం పెట్టుకోవద్దని, చేతికి దారాలు కట్టుకోవద్దని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పెళ్లైన ఆడవాళ్లు మంగళసూత్రాలు వేసుకోవడానికి కూడా అనుమతి లేదని ఒక ఉద్యోగి చెప్పడంతో గొడవ మరింత ఎక్కువైంది. దీంతో ఆ షోరూమ్‌ను వెంటనే మూసేయాలని నిరసనకారులు పట్టుబట్టారు.
ఈ గొడవ పెద్దది కావడంతో లెన్స్‌కార్ట్ సీఈఓ పీయూష్ బన్సాల్ స్పందించారు. ఆ వైరల్ అయిన డాక్యుమెంట్ పాతదని, అది ఇప్పుడు అమలులో లేదని చెప్పారు. పొరపాటున జరిగిన ఈ తప్పుకు క్షమాపణలు కోరారు. ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం.. తమ స్టోర్లలో ఎవరైనా సరే బొట్టు, తిలకం, హిజాబ్ లేదా తలపాగా వంటివి తమ ఇష్టం ప్రకారం ధరించవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశ్యం కాదని కంపెనీ పేర్కొంది.
Follow Us