/rtv/media/media_files/2026/06/06/auto-driver-2026-06-06-15-38-44.jpg)
ముంబైలో ఉండే ఒకతను అర్జంటుగా ఒక ఇంపార్టెంట్ మీటింగ్‌కు వెళ్లే కంగారులో, ఆటో డ్రైవర్‌కు ఆన్‌లైన్‌లో పొరపాటున రూ. 156కు బదులు ఏకంగా రూ. 15,682 ట్రాన్స్‌ఫర్ చేసేశాడు. ఆ తర్వాత జరిగిన మీటింగ్ కూడా అస్సలు బాగా జరగకపోవడంతో బాగా అప్సెట్ అయి బయటకు వచ్చిన అతనికి, అక్కడ ఒక ఊహించని వింత అనుభవం ఎదురైంది.
హింగ్లీష్ అనే కంపెనీ బాస్ అయిన శుభమ్ గుణే, తనకు ఎదురైన ఈ క్రేజీ ఎక్స్‌పీరియన్స్‌ను లింక్డ్‌ఇన్ అనే సోషల్ మీడియా యాప్‌లో షేర్ చేసుకున్నాడు. ఆఫీస్ టెన్షన్ వల్ల, కంగారులో అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా పంపించాల్సి వచ్చిందో ఆ రోజు ఉదయం జరిగిన కథను చెప్పుకొచ్చాడు.
శుభమ్ చెప్పిన దాని ప్రకారం.. ముంబైకి కేవలం ఒక్క రోజు కోసమే వచ్చిన ఒక ఫారెన్ క్లయింట్‌ను కలవడానికి అతను పొద్దున్నే బయలుదేరాడు. ఉదయం 7 గంటల మీటింగ్‌కు లేట్ అయిపోతుందనే కంగారులో బిల్డింగ్ బయట ఆటో దిగాడు. ఆటో ఛార్జీ రూ. 156 అయింది. కంగారులో గూగుల్ పే ఓపెన్ చేసిన శుభమ్, రూ. 156 కొట్టబోయి పొరపాటున రూ. 15,682 అని టైప్ చేసి, కనీసం స్క్రీన్ కూడా చూసుకోకుండా పిన్ నొక్కేసి బిల్డింగ్ లోపలికి పరుగుతీశాడు. కానీ ఆ రోజు పొద్దున్నే అతనికి బ్యాడ్ టైమ్ నడిచింది. ఆ ఫారెన్ క్లయింట్‌తో జరిగిన మీటింగ్ అస్సలు బాగా జరగలేదు. చేతికి వచ్చిన మంచి ఛాన్స్ మిస్ అయిపోయిందని తెగ బాధపడుతూ, కోపంతో శుభమ్ బిల్డింగ్ బయటకు వచ్చాడు.
అయితే, బయటకు వచ్చిన శుభమ్‌కు అసలైన ట్విస్ట్ ఎదురైంది. తను ఏ చోట అయితే ఆటో దిగాడో, అదే చోట ఆటో డ్రైవర్ అల్తాఫ్ ఇంకా వెయిట్ చేస్తూ నిలబడి ఉన్నాడు. శుభమ్‌ను చూడగానే ఆయన దగ్గరకు వచ్చి, సార్.. మీరు పేమెంట్‌లో ఏదో తప్పు చేశారని చెప్పాడు. ఆ తర్వాత ఆ ఆటో డ్రైవర్ చేసిన పనికి శుభమ్ దిల్ ఖుష్ అయిపోయాడు.
కంగారులో ఎక్కువ డబ్బులు పంపాడని
ఆటో డ్రైవర్ అల్తాఫ్.. శుభమ్ కంగారులో ఎక్కువ డబ్బులు పంపాడని చెప్పి, ఆ పైసలన్నింటినీ వెంటనే వెనక్కి ఇచ్చేశాడు. కనీసం ఆటో ఛార్జీ రూ. 156 అయినా ఉంచుకోమని శుభమ్ ఎంత బతిమిలాడినా అల్తాఫ్ తీసుకోలేదు. ఈ రోజు పొద్దున్నే మీ మూడ్ బాలేదని నాకు అర్థమైంది సార్, ఇది మన ఇద్దరికీ రోజు మొదలు మాత్రమే కదా అని అల్తాఫ్ నవ్వుతూ అన్నాడు. ఈ గూగుల్ పే స్క్రీన్ షాట్‌ను కూడా శుభమ్ అందరికీ చూపించాడు.
అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ మీటింగ్ ఫ్లాప్ అయిన వారం రోజుల తర్వాత, ఆ ఫారెన్ క్లయింట్ మళ్లీ శుభమ్‌కు ఫోన్ చేసి, మీతో కలిసి బిజినెస్ చేయడానికి మాకు ఓకే అని చెప్పారు. ఆ గుడ్ న్యూస్ వినగానే శుభమ్‌కు మొదటగా గుర్తొచ్చింది ఆ ఆటో డ్రైవర్ అల్తాఫ్ మాత్రమే. తను అంత టెన్షన్‌లో ఉన్నప్పుడు, ఎలాంటి స్వార్థం లేకుండా రూపాయి ఆశపడకుండా హెల్ప్ చేసిన అల్తాఫ్ నిజాయితీకి శుభమ్ సలాం అన్నాడు. ఆ తర్వాత థాంక్స్ చెబుతూ అల్తాఫ్‌కు రూ. 500 పంపించాడు. అందులో ఆటో ఛార్జీతో పాటు ఒక చిన్న గిఫ్ట్ మనీ కూడా ఉంది.
Follow Us