BIG BREAKING: మోనాలిసా కిడ్నాప్.. సంచలన వీడియో!

కుంభమేళా బ్యూటీ మోనాలిసా కేసు కీలక మలుపు తిరిగింది. ఆమె కనిపించకుండా పోవడంతో  కేసు మరింత క్లిష్టంగా మారింది. మోనాలిసా కనిపించడం లేదంటూ ఆమె భర్త ఫర్మాన్‌ సెల్ఫీ వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది.  దీంతో ఆమె కోసం పోలీసులు వెతుకుతున్నారు.

New Update
FotoJet (45)

MonaLisa kidnapping.. Sensational video

Monalisa Missing Case: కుంభమేళా బ్యూటీ మోనాలిసా కేసు కీలక మలుపు తిరిగింది. ఆమె కనిపించకుండా పోవడంతో  కేసు మరింత క్లిష్టంగా మారింది. మోనాలిసా కనిపించడం లేదంటూ ఆమె భర్త ఫర్మాన్‌ సెల్ఫీ వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది.  దీంతో ఆమె కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇప్పటికే ఆమె మైనర్‌ అనే విషయం ఎన్‌సీఎస్టీ స్పష్టం చేయడంతో ఫర్మాన్‌ పై పోక్సో కేసు నమోదు చేయడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది.

 కుంభమేళా సమయంలో పూసలు అమ్మడం ద్వారా వైరల్ అయిన మోనాలిసా  తన అందంతో అందరినీ ఆకర్శించింది. ఆ తర్వాత తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడది వివాదంగా మారింది. ఇదిలా ఉండగానే ఆమె కనిపించడం లేదని ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేయడం కలకలం రేపుతోంది.  రాజస్థాన్‌లోని అజ్మేర్ ట్రిప్‌కు వెళ్లినప్పటి నుంచి మోనాలిసా కనిపించట్లేదని అతను వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ ఘటనతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది. ఇప్పటికే మోనాలిసా మైనర్ అని జాతీయ గిరిజన సంఘం తేల్చి చెప్పింది. ఆమె వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నట్లు అధికారులు కూడా గుర్తించారు. దీంతో ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.  

అయితే కేసు నమోదైన తర్వాత నుంచి ఈ జంట కనిపించకుండా పోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వారి మొబైల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్‌లో ఉన్నాయని సమాచారం. వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టుతున్నారు.  ఈ క్రమంలోనే ఆమె భర్త ఫర్మాన్‌ ఖాన్‌ సెల్ఫీ వీడియో విడుదల చేయడం అందులో మెనాలిసా కనిపించడం లేదని వెల్లడించడం మరింత ఉత్కంఠ పెంచింది. మోనాలిసాను కిడ్నాప్ చేశారని ఫర్మాన్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అది కూడా మెనాలిసాకు సంబంధించిన వారే చేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మోనాలిసాను ఇంటికి పంపాలని  తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

ఇపుడు ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కుంభామేళా ద్వారా అతనికాలంలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మోనాలిసా ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లడం, ఇంట్లో నుంచి వెల్లిపోయి ప్రేమ వివాహం చేసుకోవడం ఒక ఎత్తయితే ముఖ్యంగా చిన్న వయస్సులో పెళ్లి జరిగిందన్న విషయం తీవ్రంగా చర్చకు దారితీసింది. చట్టపరంగా ఇది చాలా పెద్ద నేరం కావడంతో అధికారులు దీనిని సీరియస్‌గా తీసుకున్నారు. ఇపుడు మోనాలిసానే కనిపించకపోవడం కేసు మరింత క్లిష్టంగా మారింది.

Advertisment
తాజా కథనాలు