MK Stalin : విజయ్ నీకు ఆరు నెలలు టైమ్ ఇస్తాం.. స్టాలిన్ సంచలన కామెంట్స్!

తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. తాము ఆరు నెలల పాటు ఎటువంటి ఆటంకం కలిగించకుండా నిశితంగా గమనిస్తామని ఆయన స్పష్టం చేశారు.

New Update
mk stalin vijay

తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. తాము ఆరు నెలల పాటు ఎటువంటి ఆటంకం కలిగించకుండా నిశితంగా గమనిస్తామని ఆయన స్పష్టం చేశారు. తమ హయాంలో ప్రవేశపెట్టిన పలు ప్రజాకర్షక పథకాలను కొత్త ప్రభుత్వం కూడా కొనసాగించాలని స్టాలిన్ ఆకాంక్షించారు. పాఠశాల విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదని ఆయన కోరారు. ఇక తాము ఇస్తున్న రూ. 1,000 సాయాన్ని కొనసాగించాలని సూచించారు. విజయ్ తన మేనిఫెస్టోలో రూ. 2,500 ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ, అంత పెద్ద మొత్తం ఇవ్వడం ఆచరణలో కష్టమని, కనీసం తాము ఇచ్చిన రూ. 1,000 అయినా మహిళలకు అందేలా చూడాలని స్టాలిన్ పేర్కొన్నారు.

హామీల్లో 90% పూర్తి చేశాం

తమ ప్రభుత్వం 2021లో ఇచ్చిన హామీల్లో 90% పూర్తి చేసిందని, నీట్ రద్దు వంటివి కేంద్రం పరిధిలోని అంశాలు కావడంతో చేయలేకపోయామని ఆయన వివరించారు. అలాగే, రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఏడాదికి ఆరు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న విజయ్ హామీని నెరవేర్చడం అంత సులభం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ వారు ఆ హామీని నెరవేరిస్తే మాకు సంతోషమేనని స్టాలిన్ వ్యాఖ్యానించారు. తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని, ప్రస్తుతానికి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని స్టాలిన్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ డీఎంకేకు హ్యాండిచ్చి విజయ్‌కు మద్దతు తెలపడంపై డీఎంకే శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి.

ప్రస్తుతం విజయ్ పార్టీకి 108 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే కాంగ్రెస్ తన 5 గురు ఎమ్మెల్యేలతో మద్దతు ప్రకటించడంతో ఆ సంఖ్య 113కు చేరింది. మెజార్టీ నిరూపించుకోవడానికి ఈ రోజు వరకు గవర్నర్ గడువు ఇవ్వడంతో, విజయ్ మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. 
సీపీఐ (2), సీపీఎం (2), వీసీకే (2) పార్టీల మద్దతు కోసం విజయ్ సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే, ఈ పార్టీలు ఇంకా అధికారికంగా తమ నిర్ణయాన్ని ప్రకటించలేదు.

Advertisment
తాజా కథనాలు