దారుణం.. అంబులెన్స్‌లోనే బాలికపై గ్యాంగ్‌రేప్.. ఆపై ఏం చేశారంటే? మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. 16ఏళ్ల బాలికపై ఇద్దరువ్యక్తులు అత్యాచారం చేశారు. అంబులెన్స్‌లో బలవంతంగా ఎక్కించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఎవరూలేని ప్రాంతంలో వదిలేశారు. వెంటనే ఆ బాలిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. By Seetha Ram 28 Nov 2024 in నేషనల్ క్రైం New Update షేర్ చేయండి మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. 16 ఏళ్ల బాలికను ఇద్దరు దుండగులు కిడ్నాప్ చేసి అంబులెన్స్‌లో సామూహిక అత్యాచారం చేశారు. ఇప్పుడీ ఘటన మధ్యప్రదేశ్‌లో దుమారం రేపుతుంది. ఈ నెల 25న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. Also Read: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ ప్రమాణ స్వీకారం..రానున్న ఖర్గే,రాహుల్ మైనర్‌పై అత్యాచారం మౌగంజ్ జిల్లా కేంద్రానికి దాదాపు 30 కిలో మీటర్ల దూరంలో.. హనుమాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మౌగంజ్ లోని నైగర్హి తహసీల్‌కు చెందిన ఇద్దరు దుండగులు వీరేంద్ర చతుర్వేది, రాజేష్ కేతవ్.. 16 ఏళ్ల బాలికను చూశారు. ఎలాగైనా ఆమెపై అత్యాచారం చేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో జననీ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్‌లో ఆ బాలికను బలవంతంగా ఎక్కించారు. Also Read: యువతిని 40 ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు.. కారణం ఏంటో తెలుసా? ఆ తర్వాత అంబులెన్స్ కదులుతుండగానే ఒకరి తర్వాత మరొకరు బాలికపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను ఎవరూ లేని చోట వదిలిపెట్టి అక్కడి నుంచి పారిపోయారు. దీంతో ఆ బాలిక అక్కడే కాసేపు కూర్చుని ఏడ్చింది. ఆ తర్వాత అత్యాచారం నుంచి తేరుకున్న ఆ బాలిక వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది. Also Read:ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్.. టికెట్ ధరలపై 20 శాతం రాయితీ! దీంతో దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. ఇక బాలిక ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. వెంటనే నిందితులు అయిన వీరేంద్ర చతుర్వేది, రాజేష్ కేతవ్‌లును పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చేసి కోర్టులో హాజరుపరిచిన అనంతరం జైలుకు తరలించారు. ఆపై బాలికను హాస్పిటల్‌కి తరలించి పరీక్షలు నిర్వహించారు. Also Read: అఖిల్ పెళ్లి గురించి నాగార్జున కీలక వ్యాఖ్యలు. . . ! . . . #crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి