/rtv/media/media_files/2026/03/28/court-2026-03-28-15-51-48.jpg)
అలహాబాద్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లైన పురుషుడు మరో స్త్రీతో సహజీవనం చేయడం నేరం కాదని వెల్లడించింది. చట్టానికి, నైతికతకు మధ్య ఉన్న తేడాను స్పష్టం చేస్తూ కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
ఇంతకు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన ఓ18 ఏళ్ల యువతి, ఇప్పటికే పెళ్లయి నలుగురు పిల్లలు ఉన్న 30 ఏళ్ల వ్యక్తితో కలిసి లివ్-ఇన్ రిలేషన్‌షిప్ లో ఉంది. అయితే, ఆ వ్యక్తి తన కూతురిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి కిడ్నాప్ చేశాడని సదరు యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమకు ప్రాణహాని ఉందంటూ ఆ జంట హైకోర్టును ఆశ్రయించగా కోర్టు విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా కోర్టు కీలక కామెంట్స్ చేసింది. సమాజం దీన్ని తప్పుగా చూడవచ్చు. కానీ చట్టం ప్రకారం ఇద్దరు వ్యక్తులు ఇష్టపూర్వకంగా కలిసి ఉండటం నేరం కాదు. కోర్టులు సామాజిక అభిప్రాయాల ప్రకారం కాకుండా, చట్టం ప్రకారమే నడుచుకోవాలని జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ తరుణ్ సక్సేనాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
పెళ్లయిన వ్యక్తి మరొక మహిళతో ఆమె సమ్మతితో కలిసి ఉంటే, దాన్ని కిడ్నాప్ అనలేమని, అది ఏ రకమైన నేరం కిందకు రాదని కోర్టు పేర్కొంది. ఇద్దరు వ్యక్తులు తమ ఇష్టప్రకారం కలిసి ఉంటున్నప్పుడు వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని కోర్టు ఆదేశించింది. ఆ యువతి కుటుంబ సభ్యులు వారిని వేధించకూడదని, వారి ఇంటికి వెళ్లకూడదని గట్టిగా చెప్పింది.
అయితే యువతి తరపు న్యాయవాది కోర్టులో ఓ ఆసక్తికరమైన పాయింట్ లేవనెత్తారు. ఒక వ్యక్తి ఇంకో మహిళతో కలిసి ఉంటే, దాన్ని ప్రశ్నించే హక్కు కేవలం అతని మొదటి భార్యకు మాత్రమే ఉంటుందని, యువతి కుటుంబ సభ్యులకు ఆ హక్కు లేదని వాదించారు. తమను ఎక్మడ హత్య చేస్తారో అని ఆ జంట భయపడుతోంది. దీంతో షాజహాన్‌పూర్ ఎస్పీకి కోర్టు స్వయంగా ఆదేశాలు జారీ చేస్తూ, వారికి పూర్తి భద్రత కల్పించాలని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వారిని అరెస్ట్ చేయకూడదని కోర్టు ఆదేశించింది.
Follow Us