ప్రధాని అయినా ప్రణబ్ ముఖర్జీని సార్‌ అనే.. ఎందుకో తెలుసా..?

మన్మోహన్ సింగ్ MPగా ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీని సార్ అని పిలిచేవారు. అప్పుడు ఆయన ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నారు. 1982 ఇందిరాగాంధీ హయాంలో ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆర్జీఐ గవర్నర్‌గా మన్మోహన్ సింగ్ పని చేశారు. ప్రణబ్ ముఖర్జీని ఆయన గౌరవించేవారు.

author-image
By K Mohan
New Update
pranab

pranab Photograph: (pranab )

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దాదాపు 30ఏళ్లు పార్లమెంట్‌ సభ్యుడిగా కొనసాగారు. డిసెంబర్ 26న ఢిల్లీలో ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన 2004 నుంచి 2009 పదేళ్లపాటు ప్రైమ్ మినిస్టర్‌గా పని చేశాడు. అంతేకాదు 1991కి ముందు ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుడిగా, పీవీ నర్సింహరావు కేంద్ర కేబినెట్‌లో ఆర్థిక శాఖమంత్రిగా అనేక ఆర్థిక సంస్కరణలు రూపొందించారు. ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా, ఆర్బీఐ గవర్నర్ గా కూడా మన్మోహన్ సింగ్ సేవలందించారు. 1991 ఆర్థిక మాంధ్యం నుంచి ఇండియాను గట్టెక్కించింది మన్మోహన్ సింగ్ సంస్కరణలే. 

ALSO READ: విశిష్ట వ్యక్తిని కోల్పోయాం..ప్రధానితో సహా ప్రముఖుల సంతాపం

ఆయన యూపీఏ ప్రభుత్వం రెండు లోక్ సభ టర్మ్‌లకు ప్రధాని. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన కంటే సీనియర్ల చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయినా కూడా సోనియా గాంధీ ప్రధానిగా మన్మోహన్ సింగ్ పేరే సిఫార్సు చేసింది. అయితే.. ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రణబ్ ముఖర్జీని సార్ అని పిలిచేవారు. అప్పుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. 1982లో ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా మన్మోహన్ సింగ్ పని చేశారు. రాజకీయాల్లో, వయసులో పెద్దవాడైన ప్రణబ్ ముఖర్జీని మన్మోహన్ సింగ్ ఎప్పుడూ గౌరవించేవారు. 2009 జనవరి మన్మోహన్ సింగ్ రెండవసారి ప్రధాని, ప్రణబ్ ముఖర్జీ రెండోసారి ఆర్థిక మంత్రి అయ్యారు. ప్రణబ్ ముఖర్జీ 2012లో రాష్రపతి అయ్యేంతవరకూ ఆయన ప్రధానిగా ఉన్నారు.

ALSO READ : నేడు విద్యాసంస్థలకు సెలవు

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు