మారుతీ 800 అంటే మన్మోహన్ సింగ్‌కు చాలా ఇష్టం.. ఎందుకో తెలుసా?

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు BMW కారు కంటే కూడా మారుతి 800లో ప్రయాణించడమంటేనే చాలా ఇష్టమట. ప్రధానమంత్రి నివాసంలో BMW కారు వెనుక ఎప్పుడూ ఓ మారుతి 800  పార్క్ చేసి ఉండేది. అది మన్మోహన్ సింగ్ సొంత వెహికల్. నిరాడంబరమైన జీవనశౌలికి ఆయన నిదర్శనం.

author-image
By K Mohan
New Update
man car

man car Photograph: (man car)

మాజీ ప్రధాని, ఆర్థికవేత్త డా.మన్మోహన్ సింగ్‌కు BMW కారు కంటే కూడా ఆయన మారుతి 800 ఆల్టో కారులో ప్రయాణించడమంటేనే చాలా ఇష్టమట. ప్రధానమంత్రి నివాసంలో BMW కారు వెనుక ఎప్పుడూ ఓ మారుతి 800  పార్క్ చేసి ఉండేది. అది మన్మోహన్ సింగ్ సొంత వెహికల్. నిరాడంబరమైన జీవనశౌలికి ఆయన నిదర్శనం. హంగుఆర్భాటాలు లేకుండా ఆయనెప్పుడు సిప్లీ సిటీనే ఫాలో అయ్యేవారిని ఆయనతో పాటు ఉన్నవారు చెప్తుంటారు. స్పెషల్ ప్రొటెక్షన్‌ గ్రూప్‌లో పని చేసిన మాజీ ఐపీఎస్ మన్మోహన్ సింగ్‌ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆయనకు మారుతి 800 కారుతో ఉన్న అనుబంధాన్ని చెప్పారు. ఆయన ఎప్పుడూ ఆ కారులో ప్రయాణించడానికే మొగ్గు చూపేవారంట. మన్మోహన్ సింగ్ మధ్యతరగతి కుటుంబం అందుకే ఆయనకు ఆ కారు అంటే చాలా ప్రేమ.

Read also : మన్మోహన్ సింగ్ గురించి మీకు తెలియని విషయాలు ఇవే!

భద్రతా కారణాల దృష్యా ప్రధాని ఎప్పుడూ BMW కారులోనే ప్రయాణిచాల్సి వచ్చేది. అప్పుడు ఆయన ఆ కారులో అసంతృప్తి చెందేవారట. ఈ కారులో ప్రయాణించడం నాకు ఇష్టం లేదు.. నా కారు మారుతీ 800 అని ఆయన అందరితో మన్మోహన్ చెప్పపుకునే వారట. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ ఎమ్మెల్యే అసిమ్‌ మీడియాతో చెప్పారు. ఈయన మన్మోహన్ సింగ్‌కు సన్నిహితుడు. ప్రధాని స్థాయిలో ఉండి అంత నిరాడంబరంగా జీవించడం ఆయనకే సాధ్యమని అసిమ్‌ చెప్పుకొచ్చారు.

Read Also : ఆఖరి నిమిషంలో సోనియా బదులుగా మన్మోహన్.. ప్రధాని పదవి ఆయనకే ఎందుకిచ్చారంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు