BIG BREAKING : మమతా బెనర్జీకి దిమ్మతిరిగే షాక్ :  NDAకు20మంది TMC ఎంపీల మద్దతు!

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎంపీలు ఊహించని షాక్ ఇచ్చారు. టీఎంసీకి చెందిన కనీసం 20 మంది అసమ్మతి ఎంపీలు సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఒక లేఖ సమర్పించారు.

New Update
mamata

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎంపీలు ఊహించని షాక్ ఇచ్చారు. టీఎంసీకి చెందిన కనీసం 20 మంది అసమ్మతి ఎంపీలు సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఒక లేఖ సమర్పించారు. తాము భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరాలనుకుంటున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. సీనియర్ నాయకురాలు కాకొలి ఘోష్ దస్తీదార్ ఈ తిరుగుబాటు వర్గానికి నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని కాకొలి ఘోష్ దస్తీదార్ స్పష్టం చేశారు. బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తున్నాము. మా భవిష్యత్తు రాజకీయం ఎన్డీయే కూటమితో కలిసి సాగాలని మేము బలంగా నమ్ముతున్నాము అని ఆమె వ్యాఖ్యానించారు.

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓడిపోవడం, ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత ఆప్తుడిగా ఉన్న సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ అక్కడ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో టీఎంసీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఈ రాజకీయ ప్రకంపనల మధ్య, సోమవారం ఉదయమే టీఎంసీ రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే.. మరోవైపు ఢిల్లీలో ప్రతిపక్షాల ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యేందుకు మమతా బెనర్జీ ఢిల్లీ చేరుకున్న కొద్ది గంటల్లోనే ఈ తిరుగుబాటు జరగడం గమనార్హం.

ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలు ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనగా.. అదే సమయంలో అసమ్మతి ఎంపీలంతా కేంద్ర మంత్రి, బీజేపీ బెంగాల్ ఎన్నికల ఇన్‌ఛార్జ్ భూపేందర్ యాదవ్ నివాసంలో సమావేశమయ్యారు. ఈ భేటీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కూడా హాజరయ్యారు.

ఎంపీలపై అనర్హత వేటు

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. ఒక పార్టీకి చెందిన ఎంపీలపై అనర్హత వేటు పడకుండా ఉండాలంటే కనీసం మూడో వంతు మంది సభ్యుల మద్దతు ఉండాలి. ప్రస్తుతం తిరుగుబాటు చేసిన 20 మంది ఎంపీల సంఖ్య ఆ నిబంధనలకు సరిపోతుండటంతో, వారిపై ఎంపీ పదవుల రద్దు ముప్పు ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. 

ఈ తిరుగుబాటు వర్గంలో ప్రసూన్ బెనర్జీ (హౌరా), షర్మిల సర్కార్ (బర్ధమాన్ పుర్బా), జగదీష్ చంద్ర బసునియా (కూచ్ బెహార్), అరూప్ చక్రవర్తి (బాంకురా), కాళీపద సోరెన్ (ఝర్‌గ్రామ్), అసిత్ మాల్ (బోల్పూర్), బాపి హల్దార్ (మథురాపూర్) వంటి ప్రముఖ ఎంపీలు ఉన్నట్లు సమాచారం. పార్టీ యువనేత అభిషేక్ బెనర్జీ చేసిన ఫోన్ కాల్స్‌ను కూడా ఈ రెబల్ ఎంపీలు లెక్కచేయలేదని తెలుస్తోంది. ఈ రెబల్ ఎంపీలు కేవలం ఒక్క ప్రాంతానికి చెందిన వారు కాకపోవడం మమతా బెనర్జీకి మరింత ఆందోళన కలిగించే అంశం. ఉత్తర బెంగాల్, జంగిల్‌మహల్, దక్షిణ బెంగాల్ వంటి అన్ని కీలక ప్రాంతాల నుంచి ఎంపీలు ఈ తిరుగుబాటులో ఉన్నారు. ముఖ్యంగా గత కొన్ని ఏళ్లుగా బీజేపీ బలం పుంజుకుంటున్న కూచ్ బెహార్, బాంకురా, ఝర్‌గ్రామ్ ప్రాంతాల ఎంపీలు కూడా ఇందులో ఉండటం గమనార్హం.

#telugu-news #mamata-benarjee #BIG BREAKING
Advertisment
తాజా కథనాలు