MH: ఆరోజునే మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారం.. మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు అయింది. డిసెబర్ 5న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని బీజేపీ ప్రకటించింది. ముంబయ్‌లోని ఆజాద్ స్టేడియంలో సీఎంతో పాటూ పలువురు మంత్రులు ప్రమాణం చేయనున్నారు. By Manogna alamuru 30 Nov 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి విజయం సాధించింది. 288స్థానాలకు గానూ 233 సీట్లు గెలుచుకుంది. ఎన్డీయే కూటమితో కలిసి మహాయుతి మహారాష్ట్రలో ఢంకా బజాయించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 132 స్థానాలను గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. శిండే శివసేన 57, ఎన్సీపీ అజిత్ 41 పవార్ పార్టీలకు సీలు దక్కాయి. దీంతో ముఖ్యమంత్రి సదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. మొదట అందరూ సీఎం మళ్ళీ శిండే అనే అన్నారు కానీ..తర్వాత డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ పేరు తెర మీదకు వచ్చింది. మరోవైపు బీజేపీ ఎక్కవు స్థానాలు సాధించింది కాబట్టి...ఆ పార్టీకి చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి అవ్వాలని డిమాండ్ కూడా వినిపిస్తోంది. దీంతో పాటూ మంత్రి వర్గంలోకి సగం మందిని బీజేపీ నుంచి మిగతా సగం శివసేన, ఎన్సీపీ నుంచి తీసుకుంటారన్న ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో శివసేనకు 12 మంత్రి పదవులిచ్చి, అందులో మూడు కీలక శాఖలు కేటాయిస్తారన్న వార్తలు వచ్చాయి. డిసెంబర్ 5న... ఎవరు ముఖ్యమంత్రో ఇంకా ఖరారు కానప్పటికీ...ప్రమాణం స్వీకారం డేట్ మాత్రం ఫిక్స్ చేసేశారు. డిసెంబర్ 5న ముంబయ్ ఆజాద్ మైదానంలో ముఖ్యమంత్రితో పాటూ పలువురు మంత్రులు ప్రమాణం చేస్తారని బీజేపీ తెలిపింది. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఎక్స్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. తాజాగా మహారాష్ట్ర సీఎం రేసులో కొత్తగా మురళీధర్ మోహోల్ పేరు తెరపైకి వచ్చింది. భాజపా పుణె ఎంపీ అయిన మురళీధర్ ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. గతంలో పుణె మేయర్‌గా పనిచేశారు. ఇలా చాలా మంది పేర్లు తెర మీదకు వస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర సీఎంగా ఎవరిని నియమిస్తున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. Also Read: Fengal Cyclone: తీరాన్ని తాకిన ఫెంజల్..ఏపీ, తమిళనాడుకు రెడ్ అలెర్ట్ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి