మహారాష్ట్రలో సీఎం ఎన్నిక.. బీజేపీ ఎమ్మెల్యేలకు హైకమాండ్ కీలక ఆదేశాలు!

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. రేపు మధ్యాహ్నానికి ముంబైకి రావాలని బీజేపీ ఎమ్మెల్యేలకు హైకమాండ్ నుంచి ఆదేశాలు అందాయి.

New Update
Devendra Fadnavees Modi Amith Shah

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. రేపు మధ్యాహ్నానికి ముంబైకి రావాలని బీజేపీ ఎమ్మెల్యేలకు హైకమాండ్ నుంచి ఆదేశాలు అందాయి. ఈ నెల 4న ముంబైలో మహారాష్ట్ర బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. అనంతరం మహాయుతి కూటమి నేతలు రాజ్‌భవన్‌కు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించనున్నారు. ఈ నెల 5న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరును హైకమాండ్ ఇప్పటికే ఖరారు చేసింది. అయితే.. కూటమిలోని షిండే ఆయన పేరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆయనను పూర్తి స్థాయిలో ఒప్పించిన తర్వాతనే కొత్త సీఎం పేరును ప్రకటించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. 

Also Read: యూపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతం ఇక మహాకుంభమేళ జిల్లా

ఈ నెల 5న సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని బీజేపీ నేతలు చాలా రోజులుగా చెబుతున్నారు. వారు అన్నట్లుగానే అదే రోజున సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కూటమిలో కీలక నేత అయిన షిండే అసంతృప్తిగా ఉండడంతో సీఎం పేరు ప్రకటన ఆలస్యం అవుతూ వస్తోంది. క్లిష్ట సమయంలో బాధ్యతలు చేపట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా తాను ప్రభుత్వాన్ని నడిపానని షిండే అంటున్నారు. కూటమి మళ్లీ అధికారంలోకి రావడంలో తన పనితీరే కారణమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తనను డిప్యూటీ సీఎంగా చేస్తే ఎలా పని చేస్తానని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

ఇది కూడా చూడండి: ముంబైలో దారుణం.. యువతి బట్టలు విప్పించి డిజిటల్ అరెస్ట్..

నవంబర్ 23న ఫలితాలు:

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న విడుదలయ్యాయి. ఫలితాలు విడుదలై దాదాపు పది రోజులు కావొస్తున్న సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం దేశ రాజకీయాల్లోనే సంచలనంగా మారింది. వాస్తవానికి షిండేనే మరోసారి సీఎం అవుతారన్న ప్రచారం సాగింది. అయితే.. షిండే పేరును ఎన్సీపీ నేత అజిత్ పవార్ తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆర్ఎస్ఎస్ కూడా ఫడ్నవీస్ ను సీఎం చేయాలని బీజేపీపై ఒత్తిడి తెచ్చింది. దీంతో ఫడ్నవీస్ వైపు బీజేపీ హైకమాండ్ మొగ్గు చూపింది. 

ఇది కూడా చూడండి: విషాదం.. అభిమానుల మధ్య ఘర్షణ.. వందమందికి పైగా..

Also Read: మరో చరిత్ర సృష్టించనున్న ఇస్రో.. డిసెంబర్ 4న సరికొత్త ప్రయోగం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు