ఫలితాలు విడుదలై ఏడు రోజులు గడుస్తున్నా మహారాష్ట్ర సీఎం పదవిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. వారం రోజులు గడుస్తున్నా సీఎం ఎవరన్నది ఇంకా తేలలేదు. నిన్న సాయంత్రం అమిత్ షా బీజేపీ నేత ఫడ్నవీస్, శివసేన నేత షిండే, ఎన్సీపీ అజిత్ పవార్ కలిశారు. అయితే.. ముంబైలో జరగాల్సిన మహాయితి మీటింగ్ ఆకస్మికంగా రద్దు కావడం సంచలనంగా మారింది. దీంతో షిండే అనూహ్యంగా స్వగ్రామం సతారాకు వెళ్లిపోయారు. అత్యవసరంగా షిండే సతారాకు వెళ్లడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం అభ్యర్థి ఎంపికను అమిత్ షా, మోదీకే షిండే వదిలేసినట్లు తెలుస్తోంది.
Also Read : హైదరాబాద్ లో అరబ్ షేక్ ల అరాచకం.. 12 ఏళ్ల బాలికలతో కాంట్రాక్ట్ మ్యారేజ్
మంత్రి పదవుల విషయంలో బేధాభిప్రాయాలు..
అయితే సీఎం, డిప్యూటీ సీఎం పదవులపై ఏకాభిప్రాయం వచ్చినా.. మంత్రి పదవుల విషయంలో బేధాభిప్రాయాలు వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎంగా ఉండేందుకు షిండే విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. సీఎంగా ఫడ్నవీస్ పేరు ఖరారు కాగా.. అత్యంత కీలకమైన హోం శాఖను తన దగ్గరే ఉంచుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అజిత్ పవార్ ఎన్సీపీకి ఫైనాన్స్ శాఖను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Also Read : బ్లాక్ బాడీకాన్ అవుట్ ఫిట్ లో..చేతిలో అది పట్టుకొని తమన్నా హాట్ ఫోజులు
షిండే వర్గానికి అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ వర్క్స్ శాఖను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి 22 మంత్రి పదవులు, శివసేనకు 12, ఎన్సీపీకి 9 కేబినెట్ బెర్తులు దక్కనున్నట్లు సమాచారం. అయితే.. సీఎం పేరు ప్రకటన మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. డిసెంబర్ 2న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తోంది. వాస్తవానికి షిండేకే సీఎం పదవి ఇవ్వాలని తొలుత బీజేపీ భావించింది. కానీ అజిత్ పవార్ ఎదురు తిరగడంతో సీన్ రివర్స్ అయ్యింది. షిండేకు సీఎం పదవి ఇస్తే తాను ఊరుకునేది లేదని తేల్చిచెప్పడంతో.. ఫడ్నవీస్ ను సీఎం చేయాలని డిసైడ్ అయ్యింది కమలం పార్టీ.
Also Read : ఆ పాపం కేసీఆర్ దే.. సంతకంతో సహా సాక్ష్యాలు బయటపెట్టిన కాంగ్రెస్!
Also Read : 'పీలింగ్స్'.. పుష్ప 2 నుంచి మరో డ్యూయెట్!