Lok Sabha : ఏ పురుషుడికి అన్యాయం జరగదు .. లోక్‌సభలో మహిళలకు 272 సీట్లు : అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌

పార్లమెంట్ లో కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ కీలక ప్రకటన చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలు వలన ఏ రాష్ట్రానికి గానీ, ఏ పురుషుడికి గానీ ఎలాంటి అన్యాయం జరగదని అన్నారు.

New Update
arjun

పార్లమెంట్ లో కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ కీలక ప్రకటన చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలు వలన ఏ రాష్ట్రానికి గానీ, ఏ పురుషుడికి గానీ ఎలాంటి అన్యాయం జరగదని అన్నారు. డీలిమిటేషన్‌ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు వీలుగా కేంద్రం 3 కీలక బిల్లులను లోక్‌సభలో కేంద్ర ప్రవేశ పెట్టింది. అనంతరం వీటిపై చర్చ జరిగింది. 

ఈ క్రమంలో అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ మాట్లాడుతూ..  లోక్‌సభ మొత్తం సీట్ల సంఖ్య 815కు చేరుకుంటుంది. ఈ బిల్లులతో లోక్‌సభలో మహిళలకు 272 సీట్లు లభిస్తాయని చెప్పుకొచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం లోక్‌సభ సభ్యుల సంఖ్య 815కు పెరుగుతుంది, అందులో మహిళలకు 272 సీట్లు కేటాయించబడతాయని ఆయన వెల్లడించారు. లోక్‌సభ,రాష్ట్ర శాసనసభలలోని మహిళా కోటాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకు రిజర్వేషన్ ఉంటుందని మేఘ్వాల్ తెలిపారు.

ఉద్దేశపూర్వకంగా జాప్యం

మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లులపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళా కోటాను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. మూడేళ్ల క్రితం మహిళా రిజర్వేషన్ల గురించి ఏవైతే చర్చలు జరిగాయో, కేంద్రం ఇప్పుడు మళ్ళీ అవే విషయాలను చెబుతోందని ఆయన విమర్శించారు. 2023 కంటే ముందే మహిళా హక్కుల కోసం ఐదుసార్లు చట్టాలు వచ్చాయని గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మహిళా రిజర్వేషన్లకు అనుకూలంగానే ఉంటుందని స్పష్టం చేసిన గొగోయ్.. బిల్లు ఆమోదం పొందిన వెంటనే ఆ రిజర్వేషన్లు అమలులోకి రావాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లను లోక్‌సభ స్థానాల పెంపుతో డీలిమిటేషన్  ముడిపెట్టడం సరికాదని ఆయన హితవు పలికారు. డీలిమిటేషన్ కమిషన్ పేరుతో మహిళలకు దక్కాల్సిన వాటాను కేంద్రం మరింత ఆలస్యం చేయాలని చూస్తోందని మండిపడ్డారు.

Advertisment
తాజా కథనాలు