LMV లైసెన్స్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. సుప్రీం కోర్టు కీలక తీర్పు

ఎల్ఎంవీ లైసెన్స్ కలిగివున్న డ్రైవర్లకు భారీ ఊరట లభించింది. ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్లు కూడా ఇకపై కమర్షియల్ వెహికల్ నడపడానికి అర్హులేనని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. అపాయకరమైన సరకులను తీసుకెళ్లే వెహికిల్స్ కు ఇది వర్తించదని స్పష్టం చేసింది. 

New Update
dfede

LMV license: ఎల్ఎంవీ లైసెన్స్ కలిగివున్న డ్రైవర్లకు భారీ ఊరట లభించింది. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్లు కూడా ఇకపై కమర్షియల్ వెహికల్ నడపడానికి అర్హులేనని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఎల్ఎంవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ద్వారా 75 క్వింటాళ్ల బరువుకు మించని రవాణా వాహనాలను నడుపుకోవచ్చని స్పష్టం చేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని 5గురు సభ్యుల ధర్మాసనం.. చిన్న వ్యాపారులు, ఆటోలు, క్యాబ్‌లు నడిపేవారు ఎల్‌ఎంవీ లైసెన్స్‌తో 7,500 కిలోల బరువున్న వాణిజ్య వాహనాలను నడిపేందుకు అర్హులేనని తెలిపింది. ఇదే సమయంలో అపాయకరమైన సరకులను తీసుకెళ్లే వెహికిల్స్ కు ఇది వర్తించదని సూచించింది. 

ఇది కూడా చదవండి: కడప కార్పొరేషన్ మీటింగ్ లో రచ్చ రచ్చ

75 క్వింటాళ్ల కంటే తక్కువ బరువు..

అలాగే చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం బుధవారం ఏకగ్రీవంగా ఈ తీర్పు వెలవరించింది. 2017లో జస్టిస్ యూయూ లలిత్ ఆధ్వర్యంలోని బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. ముకుంద్ దేవాంగన్ వర్సెస్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ కేసులో విచారణ చేపట్టిన న్యాయస్థానం.. 75 క్వింటాళ్ల కంటే తక్కువ బరువున్న ట్రాన్స్ పోర్టు వెహికల్స్ ఎల్ఎంవీల పరిధిలోకే వస్తాయని పేర్కొంది. 

ఇది కూడా చదవండి: Anil Ambani: అనిల్‌ అంబానీకి షాక్...మూడేళ్ల పాటు ఆ కంపెనీ బంద్‌!

ఇన్సూరెన్స్ కంపెనీల పీటిషన్.. 

ఇదిలాఉంటే.. ఎల్ఎంవీ లైసెన్స్ ఉన్న డ్రైవర్లు కమర్షియల్ వెహికల్స్ నడపటం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఆ కేసులకు నష్టపరిహారం చెల్లించలేమని ఇన్సూరెన్స్ కంపెనీలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. జస్టిస్ యూయూ లలిత్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ 76 పిటిషన్లు వేశాయి. దీంతో సీజేఐ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టి.. ఆగస్టు 21న తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా ఈ కేసును పరిశీలించిన ధర్మాసనం.. ట్రాన్స్ పోర్టు వెహికల్స్ నడుపుతున్న ఎల్ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవర్లు రోడ్డు ప్రమాదాలు చేసినట్లు ఆధారలు లేవని  ఆ పిటిషన్లను తోసిపుచ్చింది. అలాగే మోటార్ వెహికల్ యాక్ట్ లో సవరణలు చేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. 

ఇది కూడా చదవండి: Chandrababu-Pawan: చంద్రబాబు, పవన్, అనిత కీలక భేటీ.. అసలేం జరుగుతోంది?

Aslo Read: మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack: పహల్గాం దాడిని పూర్తిగా షూట్‌ చేసిన వీడియోగ్రాఫర్‌.. కానీ

బైసరన్‌కు వచ్చే పర్యాటకుల కోసం రీల్స్‌ను చిత్రీకరించే చేసే ఓ స్థానిక వీడియో గ్రాఫర్‌ ఈ దాడి మొత్తాన్ని తన కెమెరాలో షూట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో NIA అధికారుల వద్ద ఉంది. దీని ఆధారంగా ఈ దాడికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుంటున్నారు.

New Update
Baisaran Reels Videographer, Who Recorded Entire Pahalgam Attack

Baisaran Reels Videographer, Who Recorded Entire Pahalgam Attack

పహల్గాం ఉగ్రదాడి వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ దాడికి సంబంధించి ఓ కీలకమైన వీడియో బయటపడింది. బైసరన్‌కు వచ్చే పర్యాటకుల కోసం రీల్స్‌ను చిత్రీకరించే చేసే ఓ స్థానిక వీడియో గ్రాఫర్‌ ఈ దాడి మొత్తాన్ని తన కెమెరాలో షూట్ చేశాడు. ఈ దాడి జరుగుతున్న సమయంలో అతడు ఓ చెట్టుపై దాక్కొని మరీ దీన్ని షూట్ చేశాడు. ఈ వీడియో ఆధారంగా జరిగిన దారుణాన్ని పూర్తిగా తెలుసుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థకు ఇది కీలకంగా మారింది.  

Also Read: పహల్గాం దాడికి ముందు ఉగ్రవాదులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి సంచలన నిజాలు

ముందుగా ఉగ్రవాదులు రెండు గ్రూపులుగా విడిపోయి లోయలో వేరువేరు దిక్కుల నుంచి తుపాకులతో కాల్పులు జరిపినట్లు అధికారులు గుర్తించారు. ముందుగా ఇద్దరు ఉగ్రవాదులు సందర్శకులను ముస్లిం మతాచారాన్ని పాటించాలని బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం నలుగురిని కాల్చి చంపేశారు. దీంతో భయంతో సందర్శకులు పారిపోయారు. జిప్‌లైన్ అనే ప్రదేశం నుంచి మరో ఇద్దరు ఉగ్రవాదులు బయటకు వచ్చారు. వాళ్లు కూడా కాల్పులు జరిపారు.  

Also Read: పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?
  
అయితే అక్కడున్న ఈ వీడియోగ్రాఫర్‌ తుటాల నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తాడు. ఓ చెట్టు కొమ్మపై దాక్కున్నాడు. ఆ తర్వాత మొత్తం ఈ ఉగ్రదాడిని షూట్‌ చేశాడు. ఈ విషయాన్ని ఓ సీనియర్ అధికారి చెప్పారు. అలాగే జాతీయ దర్యాప్తు సంస్థ అతడిని ప్రశ్నించి ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. ఉగ్రవాదులు, వాళ్లకు సహకరించిన గ్రౌండ్ వర్కర్లను గుర్తించేందుకు ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పారు. ఉగ్రవాదులు దాడి చేసే సమయంలో స్థానికుల నుంచి రెండు ఫోన్లు కూడా లాక్కున్నారు. ఇప్పుడు అధికారులు వాటిని ట్రాక్ చేస్తున్నారు.  

 

Pahalgam attack | telugu-news | rtv-news 

 

Advertisment
Advertisment
Advertisment