Monalisa Marriage : మోనాలిసాది లవ్ లవ్ జిహాద్ ..  డైరెక్టర్ సంచలన కామెంట్స్!

కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా ఎట్టకేలకు లవ్ మ్యారేజ్ చేసుకుంది. తన ముస్లిం ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను కేరళలో పెళ్లి చేసుకుంది.  మతాంతరం వివాహం కావడంతో ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు.

New Update
monalisa

కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా ఎట్టకేలకు లవ్ మ్యారేజ్ చేసుకుంది. తన ముస్లిం ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను కేరళలో పెళ్లి చేసుకుంది.  మతాంతరం వివాహం కావడంతో ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు. చివరకు కేరళ పోలీసులను ఆశ్రయించిన ఈ జంట.. తిరువనంతరపురంలో ఓ ఆలయంలో పెళ్లి చేసుకుంది. అయితే ఈ పెళ్లిపై ఆమెతో తొలి సినిమా నిర్మించిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన కామెంట్స్ చేశారు. 

ఒక పేద కుటుంబం నుంచి వచ్చి కుంభమేళాలో వైరల్ అయిన మోనాలిసాలో తనకు గంగమ్మ అంతటి పవిత్రత కనిపించిందని సనోజ్ పేర్కొన్నారు. అందుకే ఆమెకు శిక్షణ ఇచ్చి తన సినిమాలో హీరోయిన్‌గా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే తన ఎదుగుదల ఇష్టం లేని కొందరు వ్యక్తులు, ముఖ్యంగా వసీం రిజ్వీ వంటి వారు తనపై తప్పుడు ఆరోపణలు చేసి జైలుకు పంపారని ఆయన ఆరోపించారు. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో జరిగిన మహాకుంభమేళా ప్రతిష్టను దెబ్బతీయడమే వారి ఉద్దేశమని ఆయన విమర్శించారు.

సనోజ్ పలు ఆసక్తికర విషయాలు

మోనాలిసా కుటుంబ నేపథ్యం గురించి కూడా సనోజ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బంజారా సమాజానికి చెందిన ఆమె జీవితం చాలా కష్టాలతో కూడుకున్నదని, ఆమె తండ్రి తన కన్నతల్లిని వదిలేసి రెండో పెళ్లి చేసుకున్నారని తెలిపారు. మోనాలిసా సెలబ్రిటీ అయిన తర్వాత కూడా ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఒక భిక్షగత్తెలా పూసల మాలలు అమ్ముకోమని ఒత్తిడి చేసేవారని, ఆ బాధను ఆమె తనతో చెప్పుకుని ఎన్నోసార్లు ఏడ్చిందని సనోజ్ గుర్తు చేసుకున్నారు. ఆమె వ్యక్తిగత విషయాల్లో తాను ఎక్కువగా జోక్యం చేసుకోలేకపోయానని ఆయన విచారం వ్యక్తం చేశారు.

చివరగా, మోనాలిసా వివాహం వెనుక ఒక పెద్ద కుట్ర దాగి ఉందని సనోజ్ అనుమానం వ్యక్తం చేశారు. ఆమెకు చదువు చెప్పడం కోసం తాను నియమించిన ఒక టీచరే, దళారీగా మారి ఆమెను దక్షిణాదిలో విక్రయించాడని ఆయన ఘాటుగా విమర్శించారు. మోనాలిసా దీనిని తన కుటుంబంపై తిరుగుబాటుగా భావిస్తుండొచ్చు కానీ, ఆమె ఇప్పటికే లవ్ జిహాద్ ఉచ్చులో చిక్కుకుందని సనోజ్ మిశ్రా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisment
తాజా కథనాలు