లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేసిన వారికి రూ.కోటిగా పైగా రివార్డు.. బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ప్రస్తుతం అతడు జైల్లో ఉంటున్నాడు. అయితే అతడిని ఏ పోలీసు అధికారైన ఎన్‌కౌంటర్ చేస్తే రూ. కోటీ 11 లక్షల నగదు బహుమానం ఇస్తామని క్షత్రియ కర్ణి సేన ప్రకటన చేసింది. By B Aravind 22 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Lawrence Bishnoi: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యకేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ హత్య వెనుకున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు మరుమోగిపోయింది. బిష్ణోయ్ గ్యాంగ్ తర్వాతి టార్గెట్ సల్మాన్‌ఖాన్ (Salman Khan) అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ జైల్లో ఉంటున్నాడు. అయితే అతడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేస్తే రూ.1.11,11,111 నగదు బహుమానం ఇస్తామని క్షత్రియ కర్ణి సేన ప్రకటన చేసింది. ఈ సంస్థ జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్ (Dr Raj Shekhawat) దీనికి సంబంధించి ఓ వీడియో విడుదల చేసినట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. Also Read: ఈ రైలులో మీరు ఎంత తిన్నా ఫ్రీ.. పైసా కట్టక్కర్లేదు వాళ్లని వదిలేది లేదు '' ఏ పోలీస్ అధికారైన లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే వారి భద్రత, కుటుంబ భవిష్యత్తు కోసం రూ.కోటికి పైగా నజరానా ఇస్తాం. ఈ గ్యాంగ్ ఎన్నో హత్యలకు పాల్పడుతుంది. అయినాకూడా కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ అధికారులు ఈ గ్యాంగ్‌పై ఎలాంటి చర్యలు కూడా తీసకోవడం లేదు. మా సంస్థ అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని చంపిన వాళ్లని వదిలేది లేదని'' రాజ్ షెకావత్ ఆ వీడియోలో మాట్లాడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. Also Read: 'RRR' కు మించి ఆ సీన్స్ ఉంటాయి.. 'SSMB29' పై రాజమౌళి బిగ్ అప్డేట్ గతేడాది హత్య ఇదిలాఉండాగా 2023 డిసెంబర్‌లో రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి హత్య చేశారు. ఆ తర్వాత ఈ హత్య తామే చేశామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన చేసింది. కొన్నిరోజుల కితం ఎన్సీపీ సీనియర్ నేత, సల్మాన్‌ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీని కూడా తామే హత్య చేశామని బిష్ణోయ్ గ్యాంగ్ చెప్పింది. ఆయనకు అండర్‌వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉండటం వల్లే హత్య చేశామంటూ తెలిపింది. Also Read: గుడ్ న్యూస్.. వరుసగా నాలుగు రోజులు సెలవులు.. ఎప్పటినుంచంటే? మరోవైపు లారెన్స్ బిష్ణోయ్ కొన్నేళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు. జైల్లోకి అక్రమంగా వచ్చే సెల్‌ఫోన్ల ద్వారా తన అనుచరులతో నిత్యం టచ్‌లో ఉంటున్నాడు. జైల్లో ఉంటునే హత్యలకు ప్లాన్ వేస్తున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా, బాబా సిద్ధిఖీ హత్యలకు ఇలా జైల్లో ఉండే ఎవరికి తెలియకుండా ప్లాన్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. Also Read: బ్రిక్స్ సదస్సు.. రష్యాకు చేరుకున్న ప్రధాని మోదీ.. #national-news #lawrence-bishnoi #baba siddique మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి