మారథాన్‌లో సీఎం.. 2 గంటల్లో 21 కిలోమీటర్లు

జమ్ము కశ్మీర్‌లో జరిగిన తొలి మారథాన్‌లో సీఎం ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. 21 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 గంటల్లో పరిగెత్తారు. ఈ మారథాన్‌లో ఐరోపా, ఆఫ్రికా క్రీడాకారులతో పాటు 2 వేలకు మందికి పైగా పాల్గొన్నారు.

New Update
MARDHAN

జమ్మూ కశ్మీర్‌లో తొలి అంతర్జాతీయ మారథాన్ జరిగింది. ఈ మారథాన్‌లో ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా పాల్గొన్నారు. మొదటిసారిగా కశ్మీర్‌లో జరిగిన ఈ మారథాన్‌లో ఐరోపా, ఆఫ్రికా క్రీడాకారులతో పాటు 2 వేలకు మందికి పైగా పాల్గొన్నారు. ఈ మారథాన్‌లో పొల్గొన్న సీఎం 2 గంటల్లో 21 కిలోమీటర్ల దురాన్ని పరిగెత్తారు.

ఇది కూడా చూడండి: Hamas: యహ్యా సిన్వార్ ఓ కసాయే...అడ్డొస్తే చంపేయడమే!

ఇంత దూరం ఎప్పుడూ పరిగెత్తలేదు..

బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచంలోని అత్యుత్తమ మారథాన్‌‌ కార్యక్రమాల్లో కశ్మీర్ ఒకటిగా మారుతుందని ఆశిస్తున్నాని సీఎం ఒమర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఓమర్ మాట్లాడుతూ.. నా జీవితంలో 13 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఎప్పుడూ పరిగెత్తలేదని.. అది కూడా ఒక్కసారి మాత్రమే ఇలా పరిగెత్తలేదన్నారు.

ఇది కూడా చూడండి: ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. ఆ రూట్లో 4 లైన్ల హైవే.. ఇక సాఫీగా జర్నీ

చాలామంది ఈ మారథాన్‌లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. వీరితో పాటు ఎంతో ఉత్సాహంగా మారథాన్ పూర్తి చేశానని ఒమర్‌ అన్నారు. ఈ మారథన్‌లో షేర్‌ సింగ్, తంసీ సింగ్‌ విజేతలుగా నిలిచారు. వీరిని ఒమర్ ప్రశంసించారు.

ఇది కూడా చూడండి: Diwali: బంధువులు మరణిస్తే దీపావళి జరుపుకోవచ్చా?

18-35 వయసు విభాగంలో 42 కిలోమీటర్లను 2.23 గంటల సమయంలో పూర్తిచేసిన షేర్‌ సింగ్‌ పురుషుల్లో మొదటి స్థానంలో నిలిచారు. 3.03 గంటల్లో లక్ష్యాన్ని పూర్తి చేసిన తామసీ సింగ్‌ మహిళల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. విజేతలకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా బహుమతులను అందించారు.

ఇది కూడా చూడండి: Telangana: పొంచి ఉన్న తుపాన్ ముప్పు..తెలంగాణలో వానలే వానలు!\

జమ్మూ కశ్మీర్ కొత్త సీఎంగా ఒమర్ అబ్దుల్లా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసందే. ప్రముఖ కశ్మీరీ ముస్లిం కుటుంబానికి చెందిన ఒమర్ తాత, షేక్ ముహమ్మద్ అబ్దుల్లా.. జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీని స్థాపించారు. ఒమర్ తండ్రి ఫరూక్ అబ్దుల్లా కూడా మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒమర్ బొంబాయిలోని కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు