ISRO: నింగిలోకి జీశాట్–20 ఉపగ్రహం భారత అంతిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన జీశాట్–20 ఉపగ్రహం సక్సెస్‌ఫుల్‌గా నింగిలోకి ఎగిరింది. ఈ ఉపగ్రహాన్ని స్పేస్ ఎక్స్ రాకెట్ అంతరిక్షంలోకి తీసుకుని వెళ్ళింది. By Manogna alamuru 19 Nov 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి GSAT-20 Sattilite: ఇస్రో రూపొందించిన సమాచార ఉపగ్రహం జీశాట్-20 అంతరిక్షంలోకి దూసుకెళ్లింది దీనిని ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ తాలూకా ఫాల్కన్ 9 రాకెట్ ఆకాశంలోకి మోసుకెళ్ళింది. అమెరికాలోని ఫ్లోరిడా కేప్ కెనావెరల్ అంతరిక్ష పరిశోధనా సంస్థ నుంచి దీనిని ప్రయోగించారు. ఈ రాకెట్ 34 నిమిషాల పాటు ప్రయాణించిన తర్వాత ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. అక్కడ నుంచి హసన్‌లో ఉన్న ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ జీశాట్–20 ఉపగ్రహాన్ని నియంత్రణలోకి తీసుకోనుంది. ఈ మిషన్ విజయవంతంగా జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రయోగానికి ముందు ఇస్రో చీఫ్ సోమనాథ్ టీమ్‌కు మెసేజ్ చేశారు. 4700 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని మన రాకెట్‌లు తీసుకెళ్లేందుకు అవ్వలేదు. అందుకే దానిని స్పేస్ ఎక్స్ ద్వారా ఇస్రో ప్రయోగించింది. జీశాట్-20 ఉపగ్రహం 14 ఏళ్ల పాటు సేవలు అందించనుంది. వాణిజ్య పరంగా ఇస్రో, స్పేస్‌ఎక్స్ మధ్య ఇదే తొలి ప్రయోగం. భారత్‌లోని మారుమూలు ప్రాంతాలు, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ వంటి ద్వీపాల్లోనూ ఇంటర్నెట్ సేవలను అందించడమే ఈ ఉపగ్రహం లక్ష్యం. అంతేకాకుండా అడ్వాన్స్‌డ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ లక్ష్యంగా ఇస్రో దీన్ని రూపొందించింది. జీశాట్-ఎన్2 ఉపగ్రహం ద్వారా విమానాల్లో వై-ఫై సేవలు మరింత విస్తృతం కానున్నాయి. Also Read: MH: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి కారుపై రాళ్ళ దాడి.. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి